మహారాష్ట్రకు చెందిన 50 మంది సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దేశ ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్తు నేటికీ సరిగా అందట్లేదని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలాగా ఇతర రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ప్రశ్నించారు. చుక్కల్లో చంద్రుడ్ని తెచ్చి ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ నేతలను తాము అడుగుతున్నామా అని ప్రశ్నించారు. తాగు, సాగు నీరు, విద్యుత్ ఇస్తే చాలని అడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మధ్యప్రదేశ్ కి చెందిన నేత కూడా
ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్‌ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఆనంద్ రాయ్ కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆనంద్‌రాయ్ ఆర్టీసీ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.