Miss World 2025: తెలంగాణకే తలమానికంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న వేళ , ఒక్కసారిగా మిస్ ఇంగ్లాండ్ చేసిన వ్యాఖ్యలు పరువుపోయినట్లయ్యింది. ఈనెల 7వ తేది నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఈ నెలాఖరు వరకూ కొనసాగునున్నాయి. ప్రతీ రోజూ తెలంగాణలో వివిధ పర్యాటక ప్రాంతాాలు, చారిత్రాత్మక కట్టడాల వద్దకు ప్రపంచ సుందరీమణులను తీసుకెళుతున్నారు. అక్కడే ర్యాంప్ వాక్ లు, సంప్రదాయ అలకరణలు చేయిస్తున్నారు మిస్ వరల్డ్ నిర్వాహకులు. అలా తెలంగాణలో అద్బుతంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయని అంతా అనుకుంటున్న సమయంలో తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ మిస్ వరల్డ్ పోటీలు బోరింగ్ ఉన్నాయని, హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ పోటీలలో పాల్గొనడం వేశ్యను తలపించేలా ఉందని తీవ్ర విమర్శలు చేసింది మిల్లా మాగీ. అందుకే తాను ఈ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకున్నాని చెబుతూ యూకేలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె పేర్కొంది. హైదరాాాబాద్ నుంచి యూకే వెళ్లిన తరువాత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న ఈ ఇంటర్వూలో హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మిల్లా మాగీ.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల‌్లో పాల్గొన్న తనకు తీవ్ర నిరాశ కలిగిందని, ఇక్కడ వేశ్యను తలపించేలా నిర్వహాకులు వ్యవహరిస్తున్నారని, మిస్ వరల్డ్ పోటీల కాకుండా అదేదో కోతుల ప్రదర్శనలా జరుగుతోందని ఆరోపించింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీలలో ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ రాలేదని,అందుకే తాను పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. అల్పాహార సమయంలో, ప్రవేటు ఈవెంట్స్ జరుగుతున్న సందర్భంలో డబ్బు,హోదా ఉన్న పురుషులు,స్పాన్సర్ మధ్య నిరంతరం మేకప్ మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు అలాంటి డ్రస్సులే వేసుకోవాలని చెప్పడం వేశ్యను తలపించేలా ఉందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ నిర్వహణ ,ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైనట్లు యూకే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తెలిపింది.
మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలను ఖండించిన నిర్వాహకులు..
మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై నిర్వాహకులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, CEO జూలియా మోర్లీ ఏమంటున్నారంటే ..“మిస్ ఇంగ్లాండ్ 2025 మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగడం గురించి బ్రిటిష్ పత్రికల‌్లో ఇటీవల ప్రసారమైన మీడియా నివేదికలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఖండిస్తోంది. ఈ నెల ప్రారంభంలో, మిల్లా మాగీ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా పోటీ నుంచి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన తర్వాత, మిస్ ఇంగ్లాండ్‌లో 1వ రన్నరప్ అయిన షార్లెట్ గ్రాంట్ తన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చారు. షార్లెట్ బుధవారం భారతదేశానికి చేరుకుంది, అప్పటి నుంచి ఆమెను మిస్ వరల్డ్ పోటీలోకి హృదయపూర్వకంగా స్వాగతించాం.
దురదృష్టవశాత్తూ, భారత్‌లో తన అనుభవం గురించి మిల్లా మాగీ చేసినట్లు కొన్ని UK మీడియా సంస్థలు తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రకటనలు ప్రచురించాయని మా దృష్టికి వచ్చింది. అవన్నీ తప్పుడు కథనాలు,వాస్తవానికి విరుద్దంగా ఉన్నాయి అంటూ ఓ వీడియోని విడుదల చేశారు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ నిర్వాహకులు. ఆ వీడియోలో హైదరాబాద్ లో ఫుడ్ బాగుంది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయలు చక్కగా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నానంటూ మిల్లా మాగీ మాట్లడింది. ఇలా యూకే వెళ్లిన తరువాత అక్కడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మిల్లా తీవ్ర ఆరోపణలు చేస్తే, మిస్ వరల్డ్ నిర్వాహకులు దానికి పోటీగా ఆమె ఇక్కడ ఉన్నప్పుడు మాట్లడిన మరో వీడియోను విడుదల చేశారు.