Operation HMDA :  హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భూ అక్రమణలపై ప్రత్యేక దృష్టిసారించింది హెచ్ ఎండిఎ. యుద్ద ప్రాతిపదికన ఆక్రమణలు ఖాళీ చేయించే పనులు వేగవంతం చేసింది . తాజాగా ఆపరేషన్ శంషాబాద్ పేరుతో ఆక్రమణలు తొలించారు అధికారులు. తప్పుడు భూ రికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన అక్రమార్కులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( HMDA ) తనదైన స్టైల్ లో షాకిచ్చింది.  అక్రమణలు వదిలేది లేదంటూ కూల్చివేతలతో వార్నింగ్ ఇస్తోంది.




శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా స్దానికంగా కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. సంబంధంలేని సర్వే నెంబర్ల ను సాకుగా చూపించి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. మరో అడుగు ముందుకేసిన ఆక్రమణదారులు హెఎండిఏ భూముల్లో అక్రమంగా కొన్ని నిర్మాణాలను  కూడా చేపట్టారు.ఈ ఆక్రమణలను సీరియస్ గా తీసుకున్న హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు భూ రికార్డులను పరిశీలించి, చట్టపరమైన  అంశాలను పరిగణలోకి తీసుకొని  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో  ఆపరేషన్ శంషాబాద్ విజయవంతం చేశారు. నిబంధనలకు విరుద్దంగా  ఆక్రమణలకు పాల్పడ్డ స్దలాల్లో నిర్మాణాలను క్రేన్ ల సహాయంతో కూల్చేశారు.                                                     




 


ఈ ఆపరేషన్ లో దాదాపు వంద మంది హెచ్ ఎండిఏ సిబ్బంది , ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్, సైబరాబాద్ పోలీసులు  పాల్గొన్నారు.ఆపరేషన్ప శంషాబాద్ లో భాగంగా పక్కా  ప్రణాళికతో ముందుగా శంషాబాద్  ప్రాంతానికి చేరుకున్న హెచ్ఎండిఏ యంత్రాంగం రహదారులను బ్లాక్ చేాసారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఏకతాటిగా ఆక్రమణలను కూల్చివేశారు. వాస్తవానికి శంషాబాద్ లోని  181 ఎకరాల భూములను హెచ్ఎండిఏ 1990 సంవత్సరంలో అప్పటి అవసరాల కోసం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ (LA) కింద హెచ్ఎండిఏకు కేటాయించింది. శంషాబాద్ లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కు సర్వహక్కులు ఉంటాయి.   ఆ భూములను పరిశీలించగా ఆక్రమలు వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు.                                                    


ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండిఏ నర్సరీని అభివృద్ది చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు  ఎకరాల భూమిని స్దానిక ప్రజల అవసరాల కోసం  వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ కు సంబంధించిన ఈ భూముల నుంచి ముప్పై గుంటల భూమిని కేటాయించారు.  ఆపరేషన్ శంషాబాద్ విజయవంతమైన చేసిన  హెచ్ఎండిఏ అధికారులు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు  చేసి మరోసారి ఇలా ఆక్రమణలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు.