Konda Murali: వరంగల్ (Warangal)రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకమైన జిల్లా కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ(Konda Surekha), మురళిపై చర్యలకు డిమాండ్ చేశారు. ఇంతలో కొండా దంపతులు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)తో సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏం ఆలోచిస్తోంది ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సమావేశం తర్వాత కూడా కొండా మురళి తగ్గేదేలే అన్నట్టు మాట్లాడాటం మరింత క్యురియాసిటీని కలిగిస్తోంది.
కాంగ్రెస్‌లో కోవర్టులు: కొండా మురళి
కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో పార్టీలో బీఆర్‌ఎస్ కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారన ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలపై మీనాక్షి నటరాజ్‌ను 16 పేజీల లేఖను ఇచ్చారు. ఇందులో వివాదాలు, తనపై వచ్చిన ఫిర్యాదులపై కూడా ఆ లేఖలో వివరణ ఇచ్చారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలీసులతో అనుచరులను వేధిస్తున్నారని తెలిపారు. మంత్రికి సంబంధం లేకుండా ఆలయ కమిటీలు వేస్తున్నారని, మంత్రికి తెలియకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నారని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కొండా మురళి
పని చేసే వాళ్లపైనే రాళ్లు వేస్తున్నారని అన్నారు కొండా మురళి. కడియం శ్రీహరి అక్రమ మైనింగ్ చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తాము మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను బతికించడమే తమ ఉద్దేశమని అన్నారు కొండా మురళి. లోకల్ బాడీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో అన్ని కాంగ్రెస్ గెలిచేలా పని చేస్తామన్నారు. ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇచ్చినా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు.
పదేళ్లు సీఎంగా రేంవత్ రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని అన్నారు కొండా మురళి. ఎవరికీ భయపడేది లేదన్నారు. రేంవత్‌ను పదేళ్లు సీఎంగా చూడాలనుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్‌లో జరుగుతున్న రాజకీయాలు మీనాక్షి నటరాజన్‌కు వివరించామన్నారు. ఎవరికీ భయపడేది లేదన్నారు. విబేధాలు ఎవరితో లేవని తేల్చి చెప్పారు.
భయపడేదే లేదు: కొండా మురళి
ఎక్కడ గ్రూపులు లేవో చెప్పాలని మీడియాను ప్రశ్నించారు. మీడియాలోనే గ్రూప్లు ఉన్నాయని కదా అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే" నేను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నా, బీసీలకు న్యాయం చేస్తున్నా, రోజుకు 500 మందికి భోజనం పెట్టి వారికి సాయం చేస్తున్నా, నేను జనంతోనే ఉన్నా, నేను ఏ నియోజకవర్గం తిరగను, కొండా సురేఖ నియోజకవర్గం మొత్తం కూడా తిరగను. నేను ఇంట్లోనే ఉండి కలుస్తాను. అణగారిన వర్గాలు ఓ బలవంతుడి దగ్గరకు వస్తాయి. బీసీలో బలవంతుడు ఎవరని భావిస్తే అక్కడేకికే వాళ్లు వస్తారు. వారి సమస్యలు తీర్చేందుకు నేను ముందుంటున్నా, నేను ఎవరికీ భయపడను."
పరకాలలో పోటీ ఆమె ఇష్టం : కొండా మురళి
కుమార్తె రాజకీయంపై కొండా మురళి స్వరం కాస్త తగ్గించినట్టు కనిపిస్తోంది. ఆమెకు నచ్చినట్టు నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. కానీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పని చేస్తామని అన్నారు. "నేను ఓ కారులో తిరుగుతా, కొండా సురేఖ మరో కారులో తిరుగుతారు, నా కూతురు మరోకారులో తిరుగుతారు. ఎవరి ఆలోచనలు వారివి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ అనేది మా ఇష్టం. లండన్ నుంచి వచ్చిన మా పాప ఏం చేస్తుందో ఆమె ఇష్టం. నాకు ఏం తెలుస్తుంది. సురేఖ 15 ఏళ్లు పరకాల ఎమ్మెల్యేగా పని చేసింది. అక్కడి గుట్టలు, పుట్టలు నాకు, నా కూతురుకు బాగా తెలుసు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం. బీసీల అభ్యున్నతికి పోటీ చేస్తాం" అని అన్నారు.