Kokapet land auction crosses 150 crores:  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ   నిర్వహించిన నియోపోలిస్ , గోల్డెన్ మైల్ లేఅవుట్‌లో భూమి వేలం రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన  లంలో ప్లాట్ నంబర్ 15కు రూ.151.25 కోట్లు ఎకరం ధర పలికింది.   దీన్ని జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ దక్కించుకుంది. అదే విధంగా ప్లాట్ నంబర్ 16కు రూ.147.75 కోట్లు  ఎకరానికి  ధర పెట్టి జాతీయ స్థాయి రియల్టీ భారతీయ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ దక్కించుకుంది. ఇప్పటి వరకూ వేలంలో  హెచ్‌ఎండీఏకు మొత్తం రూ. 3,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.                     
 
హెచ్‌ఎండీఏ ఈసారి నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతున్న ఫేజ్-3 భాగంలో  15, 16 ప్లాట్లను వేచి పెట్టింది. ఈ ప్లాట్లు కోకాపేట్‌లోని నియోపోలిస్ లేఅవుట్‌లో ఉన్నాయి.   ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హై-టెక్ సిటీకి సమీపంలో ఉన్నాయి. బేస్ ప్రైస్ రూ.99 కోట్ల పర్ ఎకర్‌గా ఉన్నప్పటికీ, డెవలపర్ల మధ్య తీవ్ర పోటీతో ధరలు 50% పైగా పెరిగాయి. ప్లాట్ నంబర్ 15  4.85 ఎకరాల విస్తీర్ణం. రూ.151.25 కోట్లు పర్ ఎకర్ ధరకు GHR ఇన్‌ఫ్రా సొంతం చేసుకుంది.  మొత్తం ధర సుమారు రూ.734 కోట్లు. ప్లాట్ నంబర్ 16లో  5.12 ఎకరాలు. రూ.147.75 కోట్లు పర్ ఎకర్‌కు గోద్రెజ్ ప్రాపర్టీస్ సాధించింది. మొత్తం ధర సుమారు రూ.756 కోట్లు.                   

Continues below advertisement


ఈ రెండు ప్లాట్లు మిక్స్డ్-యూజ్ డెవలప్‌మెంట్ రెసిడెన్షియల్, కమర్షియల్ కు అనుకూలంగా ఉన్నాయి.   ఈ వేలంతో మొత్తం 44 ఎకరాల్లో 25 ఎకరాలు విక్రయమయ్యాయి.  స్థానిక రియల్టీ గ్రూప్‌లలో ముందంజలో ఉన్న GHR ఇన్‌ఫ్రా, ఈ ప్లాట్‌తో కోకాపేట్‌లో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.  అపార్ట్‌మెంట్లు, ఆఫీస్ స్పేసెస్ ప్రాజెక్ట్‌ను  గోద్రెజ్ ప్రకటించే అవకాశం ఉంది.      In the latest Neopolis Auction 📰 (Kokapet, Hyderabad):





 


ఈ వేలం హైదరాబాద్ రియల్ ఎస్‌టేట్ మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. గత వారం జరిగిన వేలంలో రూ.137 కోట్ల పర్ ఎకర్‌కు విక్రయమైనప్పటికీ, ఈసారి 150 కోట్ల మార్క్ దాటడం గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భూమి ధరలను మరింత పెంచుతుందని నిపుణులు అంచనా.   హెచ్‌ఎండీఏ మొత్తం 44 ఎకరాల్లో మిగిలిన ప్లాట్ల వేలం డిసెంబర్ 3, 5 తేదీల్లో జరుగనున్నాయి. ఈ వేలాలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ డబ్బు రోడ్లు, మెట్రో ఎక్స్‌పాన్షన్, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.