Jubilee Hills By Election: హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటకు ప్రచారానికి తెరపడింది. దాంతో గత కొన్ని రోజులనుంచి మోగుతున్న మైకులు సైలెంట్ అయ్యాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, ఈ 14న ఈసీ ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించనుంది. అభ్యర్థులతో పాటు వారి పార్టీల నేతలు, సీఎం, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బస్తీల చుట్టూ తిరిగి తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం నిర్వహించారు.

Continues below advertisement


 మొత్తం 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలవగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిచెందడంతో ఉప ఎన్నిక వచ్చిది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి సునీల్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.


పోలింగ్, ఏర్పాట్లు


జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1500 మంది ఓటర్లు ఉన్నారు. వీరి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల సందర్భంగా, నిబంధనల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేటి సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ (మద్యం దుకాణాలు) పూర్తిగా మూసివేయనున్నారు. ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆంక్షలు ముగిసేవరకు స్థానికేతరులు సాయంత్రం 6 గంటల తరువాత నియోజకవర్గంలో ఉండకూడదు.


నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా తిరగవద్దని పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఓట్ల లెక్కించే నవంబర్ 14న రోడ్లపైగానీ, ఇండ్ల మధ్యగానీ క్రాకర్స్ పేల్చడం నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. పోలీసులు, ఈసీకి ప్రజలు సహకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


కీలకంగా ఆ రెండు ఏరియాలు 
బోరబండ, రహ్మత్‌నగర్‌ డివిజన్లలో వచ్చే ఓట్లు విజేతను నిర్ణయించనున్నాయి. ఈ రెండు డివిజన్ల పరిధిలో 1.10 లక్షల ఓట్లు ఉండగా.. అంతా దిగువ మధ్య తరగతి వారే ఉంటారు. అందుకోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ రెండు డివిజన్లలో కీలకంగా ప్రచారం నిర్వహించారు. బస్తీల్లో తిరుగుతూ ఓట్లు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరారు.