ఏబిపి దేశం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దిగా మీ ఎన్నికల ప్రచారం ఎలా సాగింది. జనంలో స్పందన ఎలా ఉంది..?
నవీన్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ది..
జూబ్లీహిల్స్ ఓటర్లలో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మా ఎన్నికల ప్రచారంలో ప్రతీ రోజూ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నాటి నుండి ఇంకా ఊపందుకుంది. ఇక్కడ జనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన ఏర్పడింది. ఒటర్లను కలిసినప్పుడు చాలా బాగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు బీఆర్ ఎస్ పాలన చూసిన ప్రజలు ,ఇప్పడు మార్పు కోరుకుంటున్నారు.
ఏబిపి దేశం..
గత ప్రభుత్వంలో 5వేల కోట్లు ఖర్చుపెట్టి జూబ్లీహిల్స్ ను బీఆర్ ఎస్ ప్రభుత్వం అభివృద్ది చేసిందని, కాంగ్రెస్ కు ఇప్పుడు ఎందుకు ఓటేయ్యాలని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానమేంటి..?
నవీన్ యాదవ్..
గత ప్రభుత్వంలో 5వేల కోట్లు పెట్టి జూబ్లీహిల్స్ ను ఎక్కడ అభివృద్ది చేశారో చూపించాలని కేటీఆర్ ను అడుగుతున్నాము. అంతగా బీఆర్ ఎస్ హయాంలో ఇక్కడ అభివృద్ది జరిగి ఉంటే , ఇప్పుడు ఈ పరిస్దితి ఎందుకు ఉంటుంది. ఇంతలా మా ప్రాంతం ఎందుకు వెనుకబడి ఉంటుంది. ఇప్పడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్నవే. సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, కరెంట్ పోల్స్ , హైటెన్షన్ లైన్స్.. ఇలా కొన్ని వందల కోట్లతో జూబ్లీహిల్స్ లో అభివృద్ది చేస్తున్నాము. వాళ్ల చెప్పేవన్నీ అసత్యకథనాలు. ఫేక్ సర్వే రిపోర్టులు, ఫేక్ అభివృద్ది ప్రచారాలు బీఆర్ ఎస్ పార్టీ చేస్తోంది.
ఏబిపి దేశం..
ఎందుకు పదే పదే నవీన్ యాదవ్ ఓ రౌడీ అనే విమర్శిస్తున్నాయి బీఆర్ ఎస్ , బీజేపి పార్టీలు. మీరు రౌడీనా.. ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది.?
నవీన్ యాదవ్..
మా చరిత్ర ఏంటో ఇక్కడ జూబ్లీహిల్స్ జనాలకు తెలుసు. మేమేంటో, నేనేంటో కేటీఆర్ కు తెలుసు. కేసీఆర్ కు కూడా తెలుసు మేమేంటో, మా వ్యక్తిత్వమేంటో. కావాలనే మా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అనవసర ఆరోపణలు. ఓటమి భయంతోనే బీఆర్ ఎస్ , బీజేపీలు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. నాకు ఈ ప్రాంత ప్రజలతో ఉన్న సంబంధాలు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఈ ప్రాంతంలో మైనార్టీల ఉన్న బంధాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము 40 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం. కేవలం వాళ్లు ఓ పార్టీగా మాత్రమే ఇక్కడ తిరుగుతున్నారు. మేము పార్టీలతో సంబంధం లేకుండా జనంలోనే ఉన్నాం. మమ్మిల్ని నమ్ముకున్న ప్రజలకు మా వంతు సాహయం చేసుకుంటూ బలమైన బంధం ఏర్పడింది. రాజకీయంగా నవనీన్ యాదవ్ ఉండొద్దని ,నాపై బీఆర్ ఎస్ పార్టీ ఎన్నో తప్పుడు కేసులు పెట్టించింది. న్యాయస్దానం నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఏబిపి దేశం..
మీరు బీఆర్ ఎస్ నాయకులను బిదిరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మేము అనుకుంటే మీరు ఇళ్లకు కూడా వెళ్లలేరంటూ బీరు బెదిరించడం వాస్తవమేనా...?
నవీన్ యాదవ్..
కొందరు కళాకారులు ఇక్కడ ప్రచార రధంపై తిరుగుతూ , వారి పొట్టకూటి కోసం ప్రచారం చేసేందుకు వచ్చారు. అటువంటి కళాకారులను బీఆర్ ఎస్ నేతలు బెదిరించారు. కాంగ్రెస్ ప్రచార రథం పాటలు ఆపకపోతే మిమ్మల్ని కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ వాహనాలు సైతం తగులబెడతామంటూ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే బెదిరించారు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలను కొడతాం, తంతాం, తగులబెడతాం అంటే చూస్తూ ఊరుకోవాలా., ఈ ప్రాంత ప్రజలను మేం కొడతాం ,తంతాం అనడం సరైన పద్దతి కాదు. మీరు ఇతర ప్రాంతాల నుండి ప్రచారం కోసం వచ్చారు. ఓట్లడగడం తప్పుకాదు, కానీ ఇలా మా ప్రచార రథాలు తగుబెడతామనడం తప్పు అని మాత్రమే నేను చెప్పాను.
ఏబిపి దేశం..
ఏపి ఎన్నికల్లో సైతం సంచలనం రేపిన ప్రధాన సర్వే సంస్దలు ఇచ్చిన సర్వేలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ సర్వేలపై నవీన్ ఏమనుకుంటున్నాడు.. మీ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీతొో గెలుస్తారు.?
నవీన్ యాదవ్...
నాకు సర్వేలపై నమ్మకం లేదు. నేను జూబ్లీహిల్స్ ప్రజలను మాత్రమే నమ్ముకున్నాను. 2023లో కూడా అనేక సర్వేలు బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు., చివరికి ఏమైయ్యింది.ఇలా అనేక సర్వేలు వస్తుంటాయి. అన్నీ నేను పట్టించుకోను. ఇవన్నీ ఫేక్ సర్వేలు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్దిని మాత్రమే నమ్ముకున్నారు. సానుభూతి, సెంటిమెంట్లతో ఓటర్లను మార్చలేరు.ఎవరెన్ని కుట్రలు పన్నినా నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 40వేల మెజారిటీతొో గెలవబోతున్నాను.