Kavitha Latest News: లేఖతో యావత్ దేశ రాజకీయాలనే తనవైపు తిప్పుకున్న కవిత అమెరికా నుంచి వచ్చారు. కానీ ఆమెకు జాగృతి కార్యకర్తలు మాత్రమే స్వాగతం పలికారు. అటుగా ఒక్కరంటే ఒక్క బీఆర్‌ఎస్ లీడర్లు చూడలేదు. చాలా సార్లు కవిత అమెరికా వెళ్లి వచ్చారు. కానీ ఎప్పుడూ పార్టీకి చెందిన నేతలు వెళ్లి స్వాగతం పలికింది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. 24 గంటల క్రితం ఓ లేఖ లీకుతో యావత్ సినారియో మారిపోయింది. అందుకే ఎవరు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న జెండాలు ఏంటీ, కవిత అజెండా ఏంటనే ఆసక్తి నెలకొంది.

Continues below advertisement


ఎప్పటి నుంచో రగులుతున్న రాజకీయ టాపాసులకు లేఖతో నిప్పు పెట్టారు కవిత. దీంతో ఎవరికి నచ్చిన విశ్లేషణలు వాళ్లు చేసుకుంటున్నారు. కానీ ఇంత వరకు అటు బీఆర్‌ఎస్ కానీ ఇటు కవిత కానీ స్పందించలేదు. అమెరికాలో ఉండి దీనిపై స్పందించలేకపోయారు కవిత. ఇప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చారు. జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అయితే ఆమె రాక సందర్భంగా  శంషాబాద్ ఎయిర్ పోర్టు నిండిపోయింది. ఎక్కడా బీఆర్‌ఎస్‌ పేరు లేకుండా పోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు పేరు కూడా లేదు.


కవిత మీడియా సమావేశంలో ఏమన్నారంటే....


"నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్‌కు లేఖ రాయడం జరిగింది. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్‌కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పాను. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతుందోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వారి వల్ల నష్టం జరుగుతోంది. కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే... పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి?. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్‌కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. లేఖ బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బహిర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం. " అని క్లారిటీ ఇచ్చారు. 
 కవిత లెటర్‌లో ఏముంది?


“ఫీడ్‌బ్యాక్” పేరుతో కవిత తన తండ్రి, బీఆర్‌ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.  "“మీరు (KCR) కేవలం రెండు నిమిషాలు మాట్లాడిన వెంటనే, భవిష్యత్తులో BJPతో పొత్తు ఉంటుందని కొందరు ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. మీరు (BJPకి వ్యతిరేకంగా) గట్టిగా మాట్లాడి ఉండాలని నేను వ్యక్తిగతంగా భావించాను. బహుశా నేను (BJP కారణంగా) బాధపడ్డాను కాబట్టి కావచ్చు. కానీ మీరు BJPని ఇంకాస్త లక్ష్యంగా చేసుకుని ఉండాలి, డాడీ,” అని కవిత రాసిన లేఖలో పేర్కొన్నారు.