Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో పవర్‌ఫుల్‌పైట్‌ హోరాహోరీగా సాగింది. సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ హీటెక్కింది. జగదీష్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇరు పక్షాలు చాలా హాట్ హాట్‌గా కనిపించారు. దేనిపై చర్చ జరగాలే ఇప్పటి వరకు తమకు బుక్ ఇవ్వలేదని దేనిపై మాట్లాడాలో అర్థం కాలేదన్నారు జగదీష్ రెడ్డి. పదిరోజుల ముందు సభలలో పెడితే వచ్చి నష్టమేంటని ప్రశ్నించారు. ఒకే రోజు 19పద్దులపై చర్చ పెట్టడం సరికాదన్నారు. మీటర్ల విషయంలో కూడా సభను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయని.. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సభకు వివరించారు. తెలంగామలో బీఆర్‌ఎస్ ముందు చూపు కారణంగానే 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని అన్నారు. 


దీనిపై మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. దాని నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సీఎంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు సరికాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల ముందు పెట్టి సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విభజన టైంలో తెలంగాణకు అదనపు విద్యుత్‌ అప్పటి యూపీఏ ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్ర అవసరాల మేర ఈ విద్యుత్‌ కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. 


ఇలాంటి ముఖ్యమైన అంశంపై కేసీఆర్‌ మాట్లాడితే బాగుండేదని కానీ ఆయన సభకు రాకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తున్నారని రాజగోపాల్ ఎద్దేవా చేశారు. ఇది ఆయన స్థాయి సబ్జెక్ట్ కాదని అంటున్నారని అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. 


అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ బుల్స్ పేరుతో ఓ కంపెనీకి మొత్తాన్ని ఇచ్చేసి కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. ఈ క్రమంలో చేసిన కామెంట్స్‌ వివాదానికి కారణమయ్యాయి. తామేదో సత్యహరిశ్చంద్రులమనే కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాట్లాడిన జగదీష్ రెడ్డి... జైళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనకు చంచల్‌గూడ జైలు బాగా గుర్తుకు వస్తుందని అని కామెంట్ చేశారు. తాను కూడా జైలుకు వెళ్లామని అయితే ఉద్యమం చేసి జైలుకు వెళ్లామన్నారు. 


జగదీష్‌రెడ్డి కామెంట్స్‌పై మళ్లీ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రైస్‌మిల్లులో బియ్యం చోరీ చేసిన కేసు ఎవరిపై ఉందో ఎవర్ని పట్టుకొని చితక్కొట్టారో తెలుసని అన్నారు. పూర్తి వివరాలు మంత్రి వెంకట్‌రెడ్డిని అడిగితే తెలుస్తుందని అన్నారు. వెంటనే లేచి మాట్లాడిన వెంకట్‌ రెడ్డి.. పాత కేసులన్నీ ప్రస్తావించారు. దీంతో సభ మరోసారి హీటెక్కింది. దీనిపై స్పందించిన జగదీష్‌రెడ్డి... తనపై కేసులు ఉన్నట్టు... వాళ్లు చేసిన ఆరోపణలు నిరూపిస్తే కచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. లేకుంటే మంత్రి వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సభలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందిస్తూ తాను సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. అయితే హోస్‌కమిటీ వేయించాలన్నారు జగదీష్‌రెడ్డి. 


ఈ వాడీవేడి సాగుతున్న టైంలో సభను మంత్రి శ్రీధర్ రెడ్డి కంట్రోల్ చేశారు. ప్రతిపక్షం ప్రవోక్ చేస్తోందని ఇది మంచిపద్దతి కాదన్నారు. దీనికి మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కూడా జగదీష్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. విద్యుత్‌పై చరగాల్సిన చర్చ కాస్తా వేరే విషయాలపై సాగుతుండటంతో స్పీకర్‌ కలుగుచేసుకొని బీజేపీ సభ్యులకు అవకాశం ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులను వారించిన స్పీకర్‌ సబ్జెక్టుపైనే మాట్లాడాలని సూచించారు. అయితే తనపై, కేసీఆర్‌పై అధికార పార్టీ సభ్యులు చేసిన కామెంట్స్ రికార్డుల నుంచి తొలిగిస్తేనే తాను సబ్జెక్ట్‌పై మాట్లాడతామన్నారు. దీనికి స్పీకర్ ఓకే చెప్పడంతో సభ సజావుగా సాగింది.