IPL 2025 : ఐపీఎల్ 2025 కొత్త లీగ్ సీజన్ మొదలైంది. మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ దాదాపు 2 నెలలపాటు క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఆసక్తి మొత్తం అటు వైపు మళ్లుతోంది. తమ ఫేవరెట్ టీమ్స్ మ్యాచులు చూసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈసారి సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేయనున్నారు. దీనికి కారణం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులతో పాటు ఓ క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది. హైదరాబాద్‌లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బ్లాక్ టికెట్ దందా జోరుగా సాగుతోంది. ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు ఒకే రోజు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు బ్లాక్ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
శనివారం ఉదయం భరద్వాజ్ అనే వ్యక్తిని బ్లాక్ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సంపత్, హరి అనే ఇద్దరు వ్యక్తులు ఐదు బ్లాక్ టికెట్లతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితుల నుంచి ఐదు టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంపత్, హరిలపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో నేడు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల అమ్మకాలు కూడా పెరిగాయి. పోలీసులు బ్లాక్ టికెట్ల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇలాంటి కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బ్లాక్ టికెట్ల అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పోలీసుల ప్రత్యేక దృష్టి
ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బ్లాక్ టికెట్ల అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.స్టేడియం పరిసరాల్లో.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై పోలీసులు నిఘా ఉంచారు. బ్లాక్ టికెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద టికెట్లు అమ్ముతుండగా.... భరద్వాజ్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ SOT పోలీసులు పట్టుకున్నారు. నాలుగు టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం.. దీనికి జరిమానా, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో అందుబాటులో ఉంటాయి. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ (District.in)లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు.ఒకవేళ టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక వెబ్‌సైట్లకు వెళ్లినా తిరిగి డిస్ట్రిక్ట్.ఇన్ వెళ్లినా సైట్‌కే లింక్ రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను మార్చి 7న అందుబాటులో ఉంచారు. అవి హాట్ కేకుల్లా అమ్ముడ అయిపోయాయి.