iBOMMA Ravi Reaction On Piracy Allegations : iBOMMA సైట్‌లో పైరసీ మూవీస్‌తో యావత్ సినీ ఇండస్ట్రీకే చెమటలు పట్టించాడు ఇమంది రవి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. సోమవారం అతన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన తర్వాత మీడియాతో మాట్లాడాడు.

Continues below advertisement

నా పేరు రవి...

బెట్టింగ్ యాప్స్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని... వాటిని ప్రమోట్ చేశానన్న ఆరోపణల్లో నిజం లేదని 'iBOMMA రవి' చెప్పాడు. 'నా పేరు ఐబొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనే దానికి ఆధారాలు ఏవి?. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా. నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో సిటిజన్ షిప్ మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్పల్లిలోనే ఉన్నా. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా. నాపై ఆరోపణలన్నీ ఫాల్స్. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతా.' అంటూ చెప్పాడు.

Continues below advertisement

Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్

'ఐబొమ్మ రవి'కి సోమవారంతో కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 12 రోజుల పాటు కస్టడీలో రవిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రహ్లాద్ అనే వ్యక్తి ఐడీ ప్రూఫ్స్ వాడినట్లు గుర్తించారు. దీనిపై కూడా ఆరా తీస్తున్నారు.