హైదరాబాద్: ఏదో ఓ రోజు తాను సీఎం అవుతానని, తనపై బురద జల్లుతున్న వాళ్లకాళ్లు విరగ్గొడతానని, వాళ్ల తోలుతీస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే తన భర్త పేరు ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తన భర్త పేరు రాజకీయాల్లోకి లాగుతున్నారని కవిత మండిపడ్డారు. తాను ఢిల్లీలో పోరాటం చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కేసీఆర్ నీడలో ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

Continues below advertisement

పార్టీ నుంచి వెళ్లగొట్టినా వేధింపులు ఆగవా..

దేవుడి దయవల్ల తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని.. అప్పుడు ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, వాళ్ల కాళ్లు విరగ్గొడుతా, ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి నన్ను వెళ్లగొట్టారు, ఇంకా మీ కళ్లు చల్లబడలేదా, మాపై ఎందుకీ కక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు.  2014లో బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని, వాళ్ల లెక్కలు అప్పుడు తేలుస్తా అన్నారు.

Continues below advertisement

అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుపట్టారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని, అందుకే బీఆర్ఎస్ నేతల అవినీతిని ఇంకా బయటపెట్టలేదని, అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారని తనను టార్గెట్ చేసిన వారిని ఉద్దేశించి కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నేను గాంధీ, కేసీఆర్ లాగ కాదు..

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒక్కటి ఒకటి, చేసేది మరొకటి. ఒకవేళ తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతానని, అయితే నేను తప్పు చేయనని స్పష్టం చేశారు. నేను బీఆర్ఎస్‌లాగ ఎవరినీ టార్గెట్ చేయను. నేను జాతిపిత మహాత్మా గాంధీ లాగానో లేదా కేసీఆర్ లాగా అంత మంచిదాన్ని కాదు. నన్ను ఎవరైనా ఒకటి కొడితే రెండు దెబ్బలు తిరిగి కొట్టే రకాన్ని.  బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన తప్పిదాలకు, నాకు ఎలాంటి సంబంధం లేదని’ కవిత అన్నారు. 

ఆరోపణలు చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్, లీగల్ నోటీసులుతనపై ఆరోపణలు చేస్తున్న వారికి మాజీ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపినట్లు కవిత తెలిపారు. తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, అందుకుగానూ వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారికి పంపిన నోటీసులలో కవిత డిమాండ్ చేశారు. 

"దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ, నేను చేసిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు నాపై, నా భర్త గురించి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను తనపై రుద్దొద్దు.  ఎవరితోనూ తనకు ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదు" అని కవిత పేర్కొన్నారు.