Hydra: దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతూ, విస్తరిస్తున్న నగరాల్లో హైదారాాబాద్ అగ్రస్దానంలో నిలుస్తోంది. ఇంతటి మహానగరానికి మాత్రం వర్షం పడితే వణుకు తప్పడంలేదు. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడైపోతున్నాయి. డ్రైనేజ్ లు ఉప్పొంగుతూ ప్రధాన రహదారులను సైతం చెరువులుగా మార్చేస్తున్నాయి. ఓ గంట వాన పడితే నగరం అతలాకుతలమవుతోంది. వర్షాకాలంలో రోజూ వర్షాలు పడుతుంటే , భాగ్యనగరం దుస్దితి చెప్పనక్కర్లేదు. అనేక కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడం, భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడి ప్రమాదాలు సంభవించడం సర్వసాధారణంగా మారింది. 

ఈసారి హైదరాబాద్ నగరంలోని వరద కష్టాలకు ఛాన్సేలేదు. మేమున్నాం అంటోంది హైడ్రా.  ఇప్పటి వరకూ ఓ లెక్క, ఈ వర్షాకాలం నుంచి మరో లెక్క అంటున్నారు హైడ్రా అధికారులు. వరద ముంపు నుంచి నగరవాసులను రక్షించేందుకు రాత్రీ ,పగలు తేడా లేకుండా, సహాయక చర్యలకు సిద్దమనే సంకేతాలిస్తూ డీఆర్‌ఎఫ్ సిబ్బందిని మరింత బలోపేతం చేశారు. తాజాగా డీఆర్‌ఎఫ్ సిబ్బందికి అదనంగా మాన్ సూన్ టీమ్‌ను రంగంలోకి దించారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో 50 డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టీమ్ లో 12మంది సిబ్బంది ఉంటారు. వీటితోపాటు ఈ ఏడాది 130 మాన్ సూన్ టీమ్స్ అందుబాటులోకి తెచ్చారు.

ఒకప్పుడు 2సెంటిమీటర్ల వర్షపాతం నమోదైయ్యే నగరంలో ఇప్పుడు ఏకంగా 10సెంటిమీటర్లకు మించి వర్షపాతం నమోదు కావడంతో వరద ముంపు నుంచి నగరాన్నిసాధారణ పరిస్దితులు రోజురోజుకూ తీసుకురావడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కవ వరద ప్రభావం ఉండే 140 స్పాట్స్‌ను ముందుగా గుర్తించారు. సాధ్యమైనంత వేగంగా ఆ ముంపు ప్రాంతాలకు చేరుకోొవడంతోపాటు, వరద ప్రభావం నుంచి సాధారణ పరిస్దితులకు తీసుకొస్తారు. 

వరద ముంపు సమయంలో సహయక చర్యలతోపాటు బాధితులను రక్షించడంలో డీఆర్ ఎఫ్ పాత్ర కీలకమైనది. డీఆర్ ఎఫ్ వాహనాలలో సహాజయక చర్యలకు అవసరమైన పరికరాలు లేకుంటే, ఎంతమంది సిబ్బంది ఉన్నా ఇబ్బందులు తప్పవు. ఇకపై అటువంటి సమస్యలకు అవకాశం లేకుండా ప్రతీ డీఆర్‌ఎఫ్ వాహనంలోనూ ..ఎక్కడైనా బిల్డింగ్ కూలినప్పడు విడిభాగాలను తొలగించేందుక ఉపయోగించే కట్టరు, కాలనీలలో ఇళ్లలోకి , రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరితే వాటిని తొలిగించేందుకు సుగుణ మోటర్ తోపాటు, ముంపు ప్రభావం బాగా ఎక్కువ ఉంటే 10ఎమ్ హెచ్ పీ మోటర్ ఉపయోగించడం ద్వారా వరద నీటిని తోడటం ద్వారా లోతట్టు  ప్రాంతాలను రక్షించనున్నారు.

విధినిర్వహణలో అనుకోకుండ ప్రమాదాలు జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్, రాత్రి సమయంలో సైతం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం రాకుండా జనరేటర్, ఫోకస్ లైట్లు అందుబాటులో ఉంచారు. వరద నీటిలో ప్రయాణించేందుకు వాటర్ బోట్స్, జాకెట్స్ తోపాటు హమర్, ఫైర్ బాల్, ఫైర్ సిలిండర్, నెట్, రోప్ లాడర్ ఇలా వరద కష్టాల నుంచి నగరవాసులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా మాస్టర్‌ప్లాన్‌తో ముందుకెళ్లనున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ డీఆర్‌ఎఫ్, మాన్ సూన్ టీమ్స్ ఈసారి హైాదాబాద్ వాసులను వరద భయం రక్షించడం మాది బాధ్యత అంటుున్నాయి.