Hydra Action : ఈ శనివారం హైడ్రా దూకుడు చూపించింది. అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంత పెద్దలైనా వదిలి పెట్టలేదు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా భూముల్ని హైడ్రా బోర్డులు కూడా పాతారు. 

వసంత ప్రాజెక్టు స్థలం స్వాధీనం 

హఫీజ్ పేటలో ఉన్న  17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని  హైడ్రా గుర్తించింది. ఆక్రమణలు తొలగించి బోర్డు ప ెట్టారు.  ఈ  పదిహేడు ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా.  2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.  ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ చెబుతున్నారు.  హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం హాఫీజ్ పేట సర్వేనెంబర్ 79/1  పూర్తి అక్రమం అని చెబుతున్నారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అనితేలిందన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.

నార్నే ఎస్టేట్స్ స్థలం స్వాధీనం 

మరో వైపు  జూబ్లీహిల్స్‌లోని రూ.3,900 కోట్ల ప్రభుత్వ భూమిని  బాలుడి లేఖ ద్వారా హైడ్రా కబ్జా కాకుండా కాపాడిది.  JRC కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో  అకస్మాత్తుగా అక్కడ కంచెలు వేసేశారు. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఓ  బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు.  హైడ్రా  కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని గుర్తించారు.   ల్యాండ్ గ్రాబింగ్ కేసున్న‌ట్టు అక్క‌డ బోర్డులుంటుండ‌గానే.. మ‌రోవైపు అక్క‌డ ప్లాట్ల కొనుగోలుకు సంప్ర‌దించాల్సిన ఫోను నంబ‌ర్ల‌తో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ‌.   అనుమతిలేని లే ఔట్‌తో ర‌హ‌దారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు రెచ్చిపోయారు. హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారు. 

ఇంజాపూర్‌లోరోడ్డు ఆక్రమించిన ఐస్ క్రీమ్ కంపెనీ - కూల్చివేత

అదే సమయంలో   వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ లో పలు కాలనీలకు వెళ్లే రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించిందని ఫిర్యాదులువచ్చాయి.  స్థానికుల ఫిర్యాదుతో అక్రమాలను నేలమట్టం చేసి 8 కాలనీలకు దారి కల్పించింది హైడ్రా. హైడ్రా జిందాబాద్ అంటూ స్థానికులు స్వీట్లు పంచుకున్నారు.