Hyderabad Traffic Rules: హైదరాబాద్ వాహన దారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే.. భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే పెద్దమొత్తంలో జరిమానాలు విధించనున్నారు. ఈ మధ్య కాలంలో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఉల్లంఘనకు పాల్పడుతున్న వాహనదారులతోపాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడి అయింది. ఈ క్రమంలోనే వాహనదారులతోపాటు, పాదచారులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. 


రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ కు 1200 రూపాయల వరకు ఫైన్ విధించనున్నారు. ఇక జీబ్రా లైన్ దాటితే 100 రూపాయల ఫైన్, ఫ్రీ లెఫ్ట్ కు అడ్డుపడితే 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విఘించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు చెప్పారు. భారీ వాహనాలు రాంగ్ రూట్ లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ లు, ఆటోలకు విధించే జిరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని చెప్పారు. మధ్య తరగతి ప్రజలు నడిపించే వాహనాల బైక్ లు, ఆటోలపై విధించే జరిమానాలు గతంలో పోలిస్తే తక్కువగానే ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు తగ్గించాలని కోరుతున్నారు. 






ఇటీవల ఆపరేషన్ రోప్ చేపట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహనా పెంచుతున్నారు. తాజాగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. జరిమానాల (Traffic Rules In Hyderabad)ను పెంచుతూ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700 జరిమానా విధిస్తారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా చెల్లించక తప్పదని ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా ట్వీట్టర్ లో వెల్లడించారు.



ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 15 మంది చనిపోగా, ట్రిపుల్ రైడింగ్ ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలను, మరణాలను పూర్తిగా తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ దాటితే రూ.100 ఫైన్, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే రూ.1000 జరిమానా, పాదచారులకు అడ్డుగా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధిస్తున్నారు. అయితే హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ రోప్‌’ విజయవంతం కావడం, ప్రమాదాలను నివారించేందుకుగానూ ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.