Hyderabad Traffic Challan Increased: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. సోమవారం నుంచి రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) రంగనాథ్ చెప్పారు. సోమవారం నుంచి రాంగ్ రూట్, ట్రిపుల్ రైడ్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ వారం రోజులపాటు వాహనదారులను ఎడ్యుకేట్ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో ఈ డ్రైవ్ పై ఇప్పటికే రకరకాల చర్చలు నడుస్తున్నాయన్నారు. నవంబర్ 28 నుంచి రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ లో దొరికితే రూ. 1200 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.
నిబంధనలు కొత్తవి కాదు..
ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురాబోతున్న నిబంధనలు కొత్తవి కాదని, 2013 మోటార్ వెహికల్ యాక్ట్ జీవో లో ఉన్నవే అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించామని, గతంలో కన్నా ప్రస్తుతం ఫైన్స్ తగ్గించాం.. వాహన రకాన్ని బట్టి ఫైన్స్ విధిస్తున్నామని చెప్పారు. ఎక్కువగా రాంగ్ రూట్లో వాహనాలు తిరుగుతూ ఉంటాయో అక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసమే అధిక జరిమానాలు విధిస్తున్నారు అనే మాటలో వాస్తవం లేదు అన్నారు. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 ఫైన్ విధిస్తామని ( Rs 1700 Wrong side driving and Rs 1200 for Ttriple Riding) వాహనదారులు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఉత్తమమని సూచించారు.
వాహన దారుల్లో మార్పు కోసమే ఈ నిబంధనలు..
ట్రాఫిక్ నియంత్రణ పేరుతో యూ టర్న్‌లు కిలోమీటర్ల దూరంలో పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నది అవాస్తవం అన్నారు. టైమ్ బాండ్ తో నడుస్తున్న సిగ్నల్ వ్యవస్ధ మాన్యువల్ బాగానే ఉందని, సిగ్నల్ వ్యవస్ధ మెయింటేన్ చేస్తున్నామని చెప్పారు. నగరంలో విధిస్తున్న ట్రాఫిక్ ఆంక్షలు పట్ల ముందుగా వాహనదారులకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సోమవారం నుంచి
2014లో నగరంలో 41 లక్షల వాహనాలు ఉంటే, ఇప్పుడు 81 లక్షల వరకు వాహనాలు పెరిగాయి. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వారి పై చర్యలు తీసుకుంటున్నాం. టెంపరరీ వెహికల్ నెంబర్ కేవలం నెలరోజుల వరకే ఉంటుంది. ఆ తరువాత వాహనదారులు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సిందే. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు నేరాలకు పాల్పడి ఉండవచ్చు అని భావిస్తామని, ఇలాంటి పనులు చేయవద్దు అని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) రంగనాథ్ వాహనదారులకు సూచించారు.