హైదరాబాద్‌లోని కళాసిగూడాలో విషాదం చోటు చేసుకుంది. పాలకోసం వెళ్లిన నాలుగోతరగతి చదువుతున్న చిన్నారి మౌనికను మురికి కాలవ బలితీసుకుంది. చిన్నపాటి వర్షానికే నాలా పొంగి చిన్నారి ప్రాణం తీసింది. నాలాలో కొట్టుకుపోయిన చిన్నారి పార్క్‌లైన్ వద్ద శవమైతేలింది.
రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌లో ఓ చిన్నారిని బలి తీసుకుంది. నాలోలో పడిన నాల్గో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలిక మృతి చెందింది.
సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో దారుణం జరిగింది. నాల్గో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలికను నాలా మింగేసింది. ఉదయాన్నే పాల కోసం వెళ్లిన బాలిక కంటికి కనిపించని నీటితో నిండిపోయిన ఉన్న నాలాలో పడిపోయింది.
ఇదంతా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు స్థానికులు, రెండు గంటల పాటు వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉంటే... రేపు వర్షాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
ప్రమాదం, వర్షానికి నీరు నిలిచిపోయిన రోడ్లను కేటీఆర్‌కు ట్యాగ్ చేసి వేర్వేరు పార్టీ సానుభూతిపరులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.