హైదరాబాద్: ఓవైపు వర్షాలు కుండపోత కురుస్తున్నా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరా ఉండదు. కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు (Phase-III)లో మరమ్మతుల పనుల కారణంగా అక్టోబర్ 13, అక్టోబర్ 14 తేదీలలో మధ్య హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో  తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అక్టోబర్ 13న ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటలపాటు డ్రింకింగ్ వాటర్ షట్‌డౌన్ అమలులో ఉంటుంది.

Continues below advertisement

కోదండపూర్, గొడకొండల మధ్య 2375 మి.మీ మందం కలిగిన పైప్‌లైన్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దాంతో హైదరాబాద్‌లోని ఈ ఏరియాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ క్రింది ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.

నీటి సరఫరా బంద్ ఉన్న ఏరియాలుమెహదీపట్నంగోల్కొండగచ్చిబౌలికొండాపూర్మాదాపూర్జూబ్లీ హిల్స్లంగర్ హౌజ్బండ్లగూడరాజేంద్రనగర్వనస్థలిపురంఉప్పల్బోడుప్పల్ వాటి పరిసర ప్రాంతాలలో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్ చేశారు.

Continues below advertisement

ఈ ఏరియాలలో నివాసం ఉండేవారు ఈ విషయాన్ని గమనించి ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని, లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలని HMWSSB కోరింది.