Telangana BC JAC: హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఏర్పాటు అయింది. తాజాగా ఏర్పడిన బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య (R Krishnaiah ), వైస్‌ ఛైర్మన్‌గా వీజీ నారగోని వ్యవహరిస్తారు. 

Continues below advertisement

బీసీ జేఏసీలో కీలకంగా వ్యవహరించడానికి ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. బీసీల రిజర్వేషన్ పెంపు నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు ఆర్‌. కృష్ణయ్య. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా జరిగితే ఆ ప్రభావం కేంద్రంపై పడుతుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని ప్రశ్నించారు. 

కోర్టులు స్టే ఇవ్వకూడదుఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం కోర్టులు ఇలాంటి విషయాల్లో స్టే ఇవ్వకూడదు. బీసీలకు న్యాయం జరగాలని, పోరాటంలో భాగంగా ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. దశాబ్దాల నుంచి బీసీలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని భరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు బీసీలకు అన్యాయంతో పాటు అవమానం జరిగింది. చట్టసభల్లో బిల్లు పెట్టి, ఆమోదింప జేసే వరకు బీసీలం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాంమని’ బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు.

Continues below advertisement