Hyderabad News: హైదరాబాద్ లోని చంచల్ గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాలతో పాటు మహిళా కారాగారంలోని ఖైదీలకు గత రెండు వారాలుగా మాంసం పెట్టడం మానేశారు అధికారులు. తెలంగాణ జైళ్ల శాఖలో బడ్జెట్ ఇక్కట్లు ఖైదీలకు మాంసాహారాన్ని దూరం చేశాయి. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టరుకు సుమారు రూ.2 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు తెలిసింది. బడ్జెట్ విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఖైదీలకు మొదటి ఆదివారం మటన్.. మిగిలి ఆదివారాలు చికెన్ పెడుతుండే వాళ్లు. కానీ గత రెండు వారాలుగా మాంసాహారం పెట్టడం నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జైళ్లకు పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలోనూ ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది.