Madhapur Mindspace Buildings Demolition:
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ మైండ్ స్పేస్ లోని రెండు బ్లాక్స్ క్షణాల్లో నేలమట్టం అయ్యాయి. మాదాపూర్ హై టెక్ సిటీలోని 7, 8 భవనాలను శనివారం కూల్చివేశారు. ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత బాధ్యతలు తీసుకుంది. కేవలం 5 క్షణాల్లో రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు పదార్థాలను జాగ్రత్తగా వాడి, అన్ని చర్యలు తీసుకుని రెండు బిల్డింగ్స్ ను సెక్షన్ల వ్యవధిలో కూల్చివేశారు. కొన్ని రోజుల నుంచే అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఆపై రెండు బిల్డింగ్స్ కూల్చివేతకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వీకెండ్స్ కావడం, ఐటీ ఉద్యోగుల తాకిడి లేకపోవడంతో తక్కువ జన సంచారం ఉంటుందని శనివారం ఈ భారీ భవనాలను కూల్చివేశారు.
మైండ్ స్పేస్ లోని ఈ భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల నిర్మాణం చేపట్టగా సాంకేతిక సమస్యలు రావడంతో.. ఈ రెండు భవనాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో ఇదేచోట భారీ బిల్డింగ్స్ ను నిర్మించేందుకు యజమానులు ప్లాన్ చేస్తున్నారు. మైండ్ స్పేస్ లోని 7,8 బ్లాక్స్ అంతగా సెట్ అవ్వకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కూల్చివేయాలని ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెద్ద బిల్డింగ్స్ కట్టాలని ఓనర్లు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ భవనాల కూల్చివేతకు యజమానులు టీఎస్ఐఐసి నుండి అనుమతులు తీసుకున్నారు. చుట్టుపక్కల భవనాలకు అంతగా ఇబ్బందులు తలెత్తకుండా జన సంచారం తక్కువగా ఉంటే వీకెండ్ అయిన శనివారం రోజు భవనాల కూల్చివేత చేపట్టారు.