Ganesh Immersion Live Updates: జగిత్యాల గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. నీళ్లలో పడిపోయిన మున్సిపల్ ఛైర్మన్
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయింది. హూస్సేన్ సాగర్ లో మహా గణపతిని నిమజ్జనం చేశారు.
జగిత్యాల జిల్లా చింత కుంట చెరువులో గణేష్ నిమజ్జనం చేసే సమయములో ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ అదుపుతప్పి చెరువులో పడిపోయారు. మున్సిపల్ చైర్మన్‌తో సహా మరో ముగ్గురు కూడా చెరువులో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు గజ ఈతగాళ్లతో వారికి కాపాడి బయటికి తీసుకొచ్చారు.
ఖైరతాబాద్ మహారుద్ర గణపతి నిమజ్జనం పూర్తైంది. హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి నిమజ్జనం జరిగింది.
ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకుంది. కాసేపట్లో పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం జరగనుంది. దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైంది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.
గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలకు గణేశ్ లడ్డూ పలికింది. మై హోం భూజా అపార్ట్‌మెంట్‌లో గణేశ్ లడ్డూ వేలం పాటలో రూ.18.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు విజయభాస్కర్‌రెడ్డి.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్ గణేశుడిని ఊరేగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మరోవైపు భక్తులకు ఉచితంగా జీహెచ్ఎంసీ మాస్కులను పంపిణీ చేస్తుంది. మహిళల భద్రత కోసం శోభాయాత్రలో 4 షీ బృందాలతో గస్తీ కాస్తున్నాయి.
మరోసారి బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. రూ.18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి దక్కించుకున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. రథంపై భక్తులకు దర్శనమిస్తున్నాడు మహాగణపతి. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. రథంపై భక్తులకు దర్శనమిస్తున్నాడు మహాగణపతి. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది.
కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభంకానుంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపు సాగనుంది. ఇప్పటికే మహాగణపతిని ట్రాలిపై చేర్చారు. ఊరేగింపు రథంపై భక్తులకు మహాగణపతి దర్శనమిస్తున్నారు. శోభయాత్ర చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద నిమజ్జనం జరగనుంది. ప్రత్యేక పూజల అనంతరం గంగ ఒడికి చేరనున్నారు.
నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సోమవారం 5 గంటల్లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నామని చెప్పారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకూ కొనసాగనున్న గణేశ్ శోభాయాత్రను గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. దీంతో శోభాయాత్ర గమనాన్ని నెటిజన్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
బాలాపూర్ గణేశుడి ఊరేగింపు ప్రారంభమైంది. బాలాపూర్‌లోని ప్రధాన వీధుల్లో గణేశుడి ఊరేగింపు సాగుతోంది. అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలో లడ్డూ వేలంపాట జరగనుంది.
కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. భారీ వినాయకుడిని ట్రాలీపైకి ఉత్సవ కమిటీ ఎక్కించింది. క్రేన్ సాయంతో ట్రాలీపైకి ఖైరతాబాద్ మహాగణపతిని ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా.. వెల్డింగ్ పనులు చేస్తున్నారు.
Background
నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. గణపతుల నిమజ్జనాల కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్ల ద్వారా లంబోదరుడి ప్రతిమలు నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -