హైదరాబాద్ ఫార్ములా ఈరేస్ మొదటి రోజు సందడిగా సాగుతోంది. మొదటి రోజు ఈవెంట్‌కు సినీ, స్పోర్ట్స్ సెలబ్రెటీలు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా నగరవాసులు వచ్చి రేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. భారీగా వచ్చిన జనంతో ట్యాంక్‌బండ్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
హైదరాబాద్‌లో ఫార్మూలా ఈరేస్ గ్రాండ్‌గా మొదలైంది. ఉదయం నుంచి భారీగా ప్రేక్షకులు చేరుకున్నారు. రేస్ ప్రారంభమయ్యేసరికే గ్యాలరీలన్నీ నిండిపోయాయి. భారత్‌లో తొలిసారిగా అదీ హైదరాబాద్‌లో జరుగుతుండటంతో దేశం నలుమూలల నుంచి ఫార్మూలా రేస్ లవర్స్ ఇక్కడకు చేరుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ జరగనుండగా ఉదయం నుంచే ఫ్యాన్స్ గ్యాలరీలకు చేరుకున్నారు. భవిష్యత్తు అంతా ఈ కార్స్ దే కాబట్టి మినిస్టర్ కేటీఆర్ ఆలోచన ఇనీషియేటివ్ అద్భుతంగా ఉందంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.
హైదరాబాద్ ఫార్ములా ఈరేసింగ్‌లో ఈ ఉదయం క్వాలిఫైంగ్ రౌండ్ జరిగింది. దీన్ని చూసేందుకు క్రికెటర్లు వచ్చారు. సందడి చేశారు. సచిన్, చాహల్, దీపక్ చాహర్ ఈ వెంట్ కోసం హైదరాబాద్ వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.
కాసేపట్లో మెయిన్ రేస్ ప్రారంభం కానుంది. ఇది 45 నిమిషాల పాటు సాగనుంది. 45 నిమిషాల్లో 18 మలుపులను క్రాస్ చేస్తూ రేస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా 32 ల్యాప్స్ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్ 4 విన్నర్ అవుతారు. వారికి 25 పాయింట్లు లభిస్తాయి.
హైదరాబాద్ ఫార్ములా ఈరేస్‌లో ఆర్జే సూర్య సందడి చేశాడు. గ్యాలరీల్లో తిరుగుతూ రేస్ ను వీక్షించాడు. ఏపీబీ దేశంతో మాట్లాడిన ఆర్జే సూర్య పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ ఈ రేస్ కు వస్తే ఎలా ఉంటుందో ఇమిటేషన్ చేసి చూపించాడు.
నిన్న ట్యాంక్ బండ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రాంతంలో జరుగుతున్న రేసులకు లోకేష్ భార్య, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, ఎన్టీఆర్ భార్య ప్రణతి కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళడమే కాదు... పక్క పక్కన కూర్చుని నవ్వుతూ సందడి చేశారు.