హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ  ఓ టింబర్‌ డిపోలో మంటలు తీవ్రంగా చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంకు కూడా వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. టింబర్‌ డిపో, కార్ల గ్యారేజీ పక్కన ఉన్న మల్టీప్లెక్స్‌, అపార్ట్‌మెంట్‌లకు మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రదేశంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్యారేజీలోని టైర్లకు మంటలు అంటుకొని దట్టంగా పొగలు వ్యాపించాయి. ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పుతుండగా గ్యారేజ్‌లో సిలిండర్‌ పేలింది. అక్కడికి జీహెచ్ఎంసీకి చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో నివసించేవారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.