Viral News: ప్రేమ జంటల వికృత చేష్టలు, బరితెగింపులు నానాటికి పెరిగిపోతున్నాయి. నడిరోడ్డుపై ముద్దులు పెట్టుకుంటున్నారు. కౌగిలింతలతో మునిగిపోతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ (Jaipur)లో తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్‌లో జరిగింది. అర్ధరాత్రి ఓ జంట కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చి రొమాన్స్ చేయడం మొదలు పెట్టారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. 


పీవీ నరసింహరావు ఫ్లై ఓవర్‌పై జరిగిన ఈ తతంగాన్ని వెనుక వస్తున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చి రొమాన్స్ చేసిన జంట వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జంట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నడిరోడ్డుపై ఇలా చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






రాజస్తాన్‌లోనూ ఇలాంటి ఘటనే


రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. దుర్గాపుర ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బైక్ మీద ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. ప్రేమ జంట రొమాన్స్ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్త బయటకు రావడంతో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆ లవ్ బర్డ్స్‌ను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. 


పాట్నాలో రెచ్చిపోయన జంట


పాట్నాలో నడిరోడ్డుపై ఓ జంట రొమాన్స్‌కు దిగింది. రాత్రి వేళ ప్రియుడు వేగంగా బైక్‌ నడుపుతుండగా వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది. ప్రియుడికి ముద్దు పెట్టింది. ఈ తతంగాన్ని ఆ పక్కనే వస్తున్న బైకర్స్ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోపై పాట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. వీడియో ఆధారంగా బైక్‌ రిజిస్ట్రేషన్‌ నెంబరును గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లో..


ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సింబవోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ జాతీయ రహదారిపై ప్రియుడు బైక్ నడుపుతుండగా అతడి ప్రేయసి ముందు ట్యాంక్ పై కూర్చుని గట్టిగా అతడిని కౌగిలించుకుంది. వారి రొమాన్స్ ను వెనుక కారులో వెళ్తున్న వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సదరు జంటపై చర్యలు చేపట్టారు. బైక్ నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి రూ.8 వేల జరిమానా విధించారు.