Hyderabad Crime News: హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆర్థిక కష్టాలతో ఇద్దరు పిల్లల్ని చంపిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే స్పాట్‌కు వెళ్లారు. హబ్సీగూడలోని స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు శ్రీత, విశ్వంత్‌ను హత్య చేశాడు. తర్వాత భార్య కవితతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలేం జరిగిందంటే..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44) ఫ్యామిలీ గత ఏడాది హైదరాబాదులోని హబ్సిగూడకు వచ్చింది. ప్రైవేట్ కాలేజీ లో కొంతకాలం లెక్చరర్ గా చేశాడు, అక్కడ జాబ్ మానేసిన తర్వాత ఖాళీగానే ఉంటున్నారు. మరోవైపు వారికి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో కుమార్తె శ్రీత రెడ్డి(15)ని ఊరేసి చంపి, కుమారుడు విశ్వాన్ రెడ్డి(10) కి విషమిచ్చి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
సూసైడ్ నోట్ లభ్యం..
ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత భార్య కవితతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారి ఇంట్లో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు, వేరే మార్గం లేక సూసైడ్ చేసుకుంటున్నందుకు క్షమించండి. మానసికంగానే శారీరకంగాను, కెరీర్లను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నరాలు కిడ్నీ సంబంధిత వ్యాధులు, మధుమేహంతో బాధపడుతున్నాను అని’ సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ రాసుకొచ్చారు
రెండేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాడు. చేతిలో పని లేకపోవడంతో మరోవైపు అప్పులు పెరిగిపోవడంతో వాటి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. స్థానికులు 100కు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. చంద్రశేఖర్ రెడ్డి, కవిత వేర్వేరు గదుల్లో సూసైడ్ చేసుకున్నారు. పిల్లలు వారి బెడ్ రూమ్‌లో చనిపోయి పడి ఉన్నారు. ముందు పిల్లలు ఇద్దర్ని హత్య చేసిన తర్వాత కవిత, చంద్రశేఖర్ రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
విషయం తెలుసుకున్న తర్వాత బంధువులకు సమాచారాన్న చేరవేశారు. అనంతరం వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టు మార్టం పూర్తి చేసి బంధువులకు ఆ డెడ్‌బాడీలను అప్పగించనున్నారు.