Hyderabad Latest News: భారతీయ ప్రాచీన వైద్య విధానమైన సిద్ధ వైద్యానికి అంతర్జాతీయ స్థాయిలో అపూర్వమైన గుర్తింపు లభించింది. సనాతన వైద్య పద్ధతులకు ఆధునిక పరిశోధనల మేళవింపుతో ఎంతో మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఫేమస్ సిద్ధ వైద్యురాలు డాక్టర్ సత్య సింధుజను అత్యంత ప్రాతిష్టాత్మకమైన 'భారత్ సమ్మాన్ పురస్కార్' వరించింది.
హౌస్ ఆఫ్ లార్డ్స్ వేదికగా సత్య సింధుజకు పురస్కారం
లండన్‌లోని సుప్రసిద్ధ, చారిత్రక కట్టడమైన'హౌస్ ఆఫ్ లార్డ్స్' వేదికగా జరిగిన కార్యక్రమంలో సత్య సింధుజాకు ఈ అవారును ప్రదానం చేశారు. సత్య సింధుజ కేవలం సంప్రదాయ వైద్యానికే పరిమితం కాకుండా, నేటి ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక, క్లిష్టమైన వ్యాధులపై లోతైన పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మనిషిని తీవ్రంగా వేధించే మైగ్రేన్, చాలా రకాలైన వెన్నుముక సమస్యలు, క్రాన్, ఆర్థరైటీస్, ఫైబ్రోమైయాలిర్జాయా లాంటి ప్రమాదకరమైన ఆటోఇమ్యన్ వ్యాధులపై ఆమె చాలా శ్రమించారు.
సిద్ధ వైద్యంలో చాలా కాలంగా కృషి
చక్ర సిద్ధ క్లినిక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా సింధుజ తన వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు. వ్యాధి లక్షణాలను మాత్రమే గుర్తించడమే కాకుండా వ్యాధి మూలాలను తెలుసుకుంటున్నారు. దీని ద్వారా వారికి చికిత్స చేస్తున్నారు. దీని వల్ల వ్యాధి త్వరగా నయం అవుతోంది.
అభినందించిన సినీ, వైద్య రంగ ప్రముఖులు
సత్య సింధుజకు అంతర్జాతీయస్థాయిలో ఇంతటి గొప్ప పురస్కారం లభించడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ సత్య సింధుజను శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయ వైద్యాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబెటినందుకు ఆమె కృషిని కొనియాడారు. ప్రపంచం మొత్తం ఆధునిక వైద్యం వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో, భారతీయ మూలాలైన సిద్ధ వైద్యం గొప్పదనాన్ని, దానిలోని శాస్త్రీయతను చాటి చెప్పడం వైద్యరంగంలో మైలురాయిగా చెబుతున్నారు. ఈ అవార్డు రావడం సింధుజగా వ్యక్తిగత విజయంగా మాత్రం చూడకుండా భారతీయ సిద్ధ వైద్యానికి దక్కిన గౌరవంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.
