మేడ్చల్ జిల్లా జీడిమెట్ల : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో విచిత్రమైన సంఘటన జరిగింది. చింతల్ లోని శ్రీనివాస్ నగర్ లో ఇంటి ఓనర్ తన ఇంటిని ఎత్తు పెంచడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇంటి కింద అమర్చిన హైడ్రాలిక్ జాకీలు పక్కకు జరగడంతో ఈ ఇల్లు పక్కనున్న భవనంపై వాలింది. ఆందోళన చెందిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. ఇళ్లు వాలిపోయిందని తెలియగానే ఆ రెండు ఇళ్లలో నివాసం ఉండే భయాందోళనకు గురై వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి రోడ్డుపై నిల్చుని, అసలేం జరిగిందో తెలుసుని ఆందోళనకు గురయ్యారు.


స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..
నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 సంవత్సరాల కిందట చింతల్ శ్రీనివాస్ నగర్ లో ఇల్లు కట్టించారు. అయితే ఆ ఇల్లు ఇప్పుడు చూస్తే సరిగ్గా ఉన్నట్లు ఓనర్ కు అనిపించలేదు. ఓ వైపు ఎత్తు తక్కువగా ఉండి కిందకి ఉందనుకున్నాడు. దాంతో తన ఇంటిని జాకీలతో ఒకటిన్నర ఫీట్ ఎత్తు పెంచడానికి నాగేశ్వరరావు శనివారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంటి కింద అమర్చిన జాకీలు అదుపు తప్పడంతో ఇల్లు పక్కింటి భవనంపై వాలిపోయింది. స్థానికులు సమాచారం అందించగా.. జీహెచ్ఎంసి అధికారులు హుటాహుటీన అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆ భవనాలలో ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయిస్తున్నారు. కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇల్లు కింద జాకీలు ఉందుకు పెట్టారు, అసలేం జరిగిందని ఇంటి ఓనర్ ను ఆరా తీస్తున్నారు. ఆ బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 


రేపు కూల్చివేతలకు ఏర్పాట్లు
ఇంటి ఎత్తు పెంచాలని ప్రయత్నించగా విపలమైంది. ఆ ఇళ్లు పక్కనున్న భవనంపై వాలిపోయిందని కుత్బుల్లాపూర్‌ టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య, సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని రేపు కూల్చివేస్తామని వెల్లడించారు. జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసిన బిల్డింగ్, పక్కనున్న భవనంపై ఒరిగి పోవడంపై రెండు బిల్డింగులు ఎప్పుడు కూలతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుకు బిల్డింగ్ డౌన్‌ ఉండటంతో పైకి లేపే ప్రయత్నం చేయగా విఫలమైందని ఆఖరికి కూల్చివేత వరకు వెళ్లిందన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial