Minister Bhatti:  తెలంగాణలో సమ్మక్క, సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి కొండ సురేఖ ఆదేశాలతో ఇప్పటికే అధికారలు రంగంలోకి దిగారు. గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు కసరత్తు ప్రాంరంభించారు.రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజాగా జరిగిన ఫ్రీ బడ్జెట్ సమావేశంలో  ఆదేశించడంతో ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నారు అధాకారులు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్క్ లను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు వీకెండ్ లో రిలాక్స్ అయ్యేందుకు అవకాశం కల్పించడంతోపాటు,  టైగర్ రిజర్వ్ ప్రాంతాలు అభివృద్ధి ద్వారా ఆయా శాఖలకు ఆదాయం కూడా సమకూరుతుందని భావిస్తున్నారు. 


తెలంగాణలో దేవాాలయాలపై ప్రత్యేక దృష్టి...


రానున్న పుష్కరాల నేపధ్యంలో పర్యాటక రంగంతోపాటు తెలంగాణలో పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టిసారించింది. దేవాలయాల పునరుద్దరణ ద్వారా ప్రజల్లో భక్తి భావన పెరుగడంతోాటు , దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉంటుందని అధికారులు భావించారు. అందుకే రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ల రూపకల్పనపై మంత్రులు ప్రత్యేక దృష్టిసారించారు.


పోడుభూముల సమస్యలకు పరిష్కారం..


అటవీ హక్కు చట్టం ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ, పట్టాలు ఇచ్చిన భూములు వారు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో అటవీ శాఖ తో సమన్వయం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదరువుతున్నట్లు గుర్తించిన అధికారుల ఈ విషయాన్ని డిప్యూటి సిఎం బట్టి వద్దకు తీసుకెళ్లారు. దీంతో గిరిజన రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వివిధ పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులకు పంపుసెట్ల వినియోగం వంటి కార్యక్రమాల పై అవగాహాన కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైయ్యింది. CAMPA (compensatory afforestation fund management and planning authority) పనులు పెద్ద సంఖ్యలో చేపట్టి పచ్చదనాన్ని కాపాడాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని చెక్ డ్యాములు, ఇతర పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.


ఐటీ ఉద్యోగుల ఒత్తిడి తగ్గించేలా హైదరాబాద్ లో అర్బన్  పార్కులు


హైదరాబాద్ మహానగరం తో పాటు సమీపంలోని వివిధ ప్రాంతాల్లో  59 అర్బన్ పార్కులు ఉన్నాయి, ఒత్తిడిలో జీవించే నగర ప్రజలు ఉపశమనం పొందేందుకు వీటిని అభివృద్ధి చేయాలని., స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు  అర్బన్ పార్క్ ల అభివృద్ది ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా అన్వేషించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు డిప్యూటి సిఎం బట్టి విక్రమార్క. అంతేకాదు, ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి, విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. చిన్న చిన్న మొక్కలు కాకుండా రెండున్నర అడుగుల ఎత్తుకు తగ్గకుండా ఉన్న మొక్కలను నాటడం ద్వారా ఎక్కువ సంఖ్యలో బతికే అవకాశం ఉండటంతో ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్దమైయ్యారు.