Telangana Ration Card Latest News :రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటీ?

Telangana Ration Card Latest News :చాలా మంది ఈ విషయం తెలియకపోవడంతో రేషన్ కార్డు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేస్తే కచ్చితంగా మీకు రేషన్ కార్డు వస్తుంది.

Continues below advertisement

Telangana Ration Card Latest News :తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆశావాహులంతా మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాపాలన నుంచి మొన్న జరిగిన కులగణన వరకు చాలా సార్లు అప్లై చేశామని అయినా కార్డుల అర్హుల జాబితాలో తమ పేర్లు ఉండటం లేదని అంటున్నారు. దీనికి అధికారులు చెబుతున్న సమాధానం ఒక్కటే. పాత కార్డుల్లో పేరు ఉన్నప్పుడు కొత్త కార్డు అప్లై చేయడానికి లేదని అంటున్నారు. అలాంటి అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయని అంటున్నారు. అందుకే కొత్త కార్డుకు అప్లై చేసే ముందు పా కార్డులో ఉన్న పేర్లు తొలగించుకోవాలని సూచిస్తున్నారు. 

Continues below advertisement

కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసే వాళ్లంతా ముందు పాత కార్డులో ఉన్న అంటే తమ తల్లిదండ్రులతో ఉన్న కార్డుల్లో తమ పేర్లు డిలీట్ చేయించుకోవాలి. అందుకు కొంత ప్రోసెస్ ఉంటుంది. ఇది పూర్తి అవ్వడానికి వారం పది రోజులు పడుతుంది. అలా తొలగించుకున్న తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలని అప్పుడే ప్రభుత్వం పరిశీలిస్తుందని అంటున్నారు. 

పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకోవడానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం లేదా ఆఫ్‌లైన్‌లో తొలగించుకోవడం. ఆఫ్‌లైన్‌లో పేరు తొలగించుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పాత కార్డులో నా పేరు ఉంది. నేను కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలి పాత కార్డు నుంచి నా పేరు తొలగించండి అని రిక్వస్ట్‌ లెటర్ పెట్టుకోవాలి. ఆ లెటర్‌తోపాటు పాత కార్డు జిరాక్స్‌, మీ ఆధార్ కార్డు. కరెంటు బిల్లు, మ్యారెజ్ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయిన వారి పేర్లు తొలగించాలంటే కూడా అదే విధంగా అప్లై చేయాలి. పై డాక్యుమెంట్స్‌తోపాటు చనిపోయిన వారి డెత్‌ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

Also Read: కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఆన్‌లైన్‌లో కూడా రేషన్ కార్డులో పేరు తొలగించుకునేందుకు అప్లై చేసుకోవచ్చు. Telangana Food & Civil Supplies Portalకు వెళ్లాలి ఉంటుంది. ప్రస్తుతానికి అందులో అలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. మీ సేవ కేంద్రానికి వెళ్లాలని మాత్రమే చెబుతున్నారు. అంటే ఆఫ్‌ లైన్‌లో మీ సేవ కేంద్రం ద్వారానే అప్లై చేసుకోవడానికి అనుమతి ఉంది.  

పాత రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయకుండా కొత్త కార్డు అప్లై చేయడానికి లేదు. అలా ఎన్ని సార్లు మీరు అప్లై చేసినా ప్రయోజనం ఉండదు. రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. అందుకే పాత రేషన్ కార్డులో పేరు ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయొద్దని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రిజెక్ట్ అయిన చాలా దరఖాస్తుల్లో అలాంటివే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. 

ఒకసారి పేరు డిలీట్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఆన్‌లైన్‌లోనే స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్‌ ద్వారా EPDS తెలంగాణ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా అనుమానాలు ఉంటే సివిల్ సప్లై హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1967కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా మీకు దగ్గర్లో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్తే ఇంకా వివరంగా చెబుతారు.  

Also Read: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..

Continues below advertisement