BRS Chalo Bas Bhavan : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమైంది. నేడు చలో బస్‌భవన్ పేరుతో ఆందోళనలు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేతలు సిద్ధమవుతున్న టైంలో కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమను నిరోధించడానికి పెట్టిన శ్రద్ధ పాలన, నేరాల నియంత్రపై పెట్టాలని ఎద్దేవా చేస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహిళలకు ఉచిత బస్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీల భారం ప్రజలపై మోపుతోందని మండిపడ్డారు. ఇలా చేయడం వల్ల ఒక్కో ఫ్యామిలీపై ఇరవై నుంచి 30 శాతం మేరకు భారం పడుతుందని వెంటనే ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు చలో బస్ భవన్ పేరుతో నిరనస కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
చలో బస్‌భవన్‌లో భాగంగా 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆర్టీసీ బస్‌లో వెళ్లాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్‌భవన్ వరకు ప్రయాణించి అక్కడ ఆర్టీసీ ఎండీతో సమావేశమై వినతిపత్రం ఇవ్వాలని డిసైడ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హైదరాబాద్ పరిధిలో ఉన్న కీలక నేతలంతా ఇందులో పాల్గొనాని భావించారు. కానీ పోలీసులు వారందర్నీ హౌస్ అరెస్టు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు.
హౌస్ అరెస్టులపై స్పందించిన కేటీఆర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా వివరాలు పంచుకున్నారు. తనతోపాటు ఇతర ముఖ్య నేతల ఇంటి ముందు పోలీసులు మోహరించడాన్ని తప్పుపట్టారు. "పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి ఒక లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు." అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
బీఆర్‌ఎస్ నేతలను నియంత్రించడంలో చూపిన శ్రద్ధ నేరలను కంట్రోల్ చేయడం చూపించాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. "మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీ కి కొత్త కాదు."