High Court ordered Ranganath to appear in court: తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కంటెంప్ట్ పిటిషన్ విచారణలో, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి గురువారం కీల వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5లోపు ప్రత్యక్షంగా హాజరు కాకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేస్తామని స్పష్టం చేశారు. బతుకమ్మకుంట, హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలో 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చారిత్రక చెరువు. 1962లో 14 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ చెరువు, అనధికార ఆక్రమణలతో 5.15 ఎకరాలకు మాత్రమే పరిమితమయింది. మాజీ కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు ఫిర్యాదుపై HYDRA 2024 నవంబర్ 13న చెరువు పరిశీలించి, పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కానీ, బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఈ భూమి తన ప్రైవేట్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసి, హైకోర్టును ఆశ్రయించారు.
2025 ఫిబ్రవరిలో హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. మార్చిలో HYDRAA రివ్యూ పిటిషన్ డిస్మిస్ అయింది. మేలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే పనులు చేయడంతో రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, GHMC డిప్యూటీ కమిషనర్‌లకు కోర్టు ధిక్కరణ నోటీసుల ుఇచ్చింది. ఆగస్టులో మరో కేసులోనూ నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబర్‌లో హైకోర్టు రంగనాథ్‌ను కోర్టులో హాజరు కావాలని సమన్స్ జారీ చేసింది. జనవరి 2025లో సిటీ సివిల్ కోర్టు HYDRAAకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, భూమిని చెరువుగా ధృవీకరించింది. రెవెన్యూ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, సాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా ఈ తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, HYDRAA పనులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 27న జరిగిన విచారణలో, జస్టిస్ విజయసేన్ రెడ్డి HYDRAAపై 'రిపీటెడ్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ' అని వ్యాఖ్యానించారు. కోర్టు GHMC, HMDA, మున్సిపాలిటీలు, వాటర్ బోర్డు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల పనులు HYDRAA చేయాలా? అని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు డిమాలిషన్‌కు ముందు నోటీసు, హియరింగ్ వంటివి పాటించకపోవడం, స్టేటస్ కో ఉల్లంఘనలు, పట్టా భూములపై బలప్రయోగం వంటి వాటిని న్యాయమూర్తి ప్రశ్నించారు. అథారిటీ ప్రజలకు మంచి చేయడానికి ఇచ్చారు కానీ పవర్ చూపడానికి కాదు. మీరు పవర్ చూపాలనుకుంటే, కోర్టుకు సూపీరియర్ పవర్ ఉంది. కోర్టులను ప్రావోక్ చేయకండి అని హెచ్చరించారు. రోజువారీ ధిక్కరణ పిటిషన్లు వస్తున్నాయన్నారు. కోర్టు తన ఆర్డర్ల విలువ తెలుసు. ఉల్లంఘించితే, కోర్టు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుసు అని మండిపడ్డారు. డిసెంబర్ 5కు వాయిదా వేసి, ఆ తేదీలోపు రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరు కావాలని, కౌంటర్లు ఫైల్ చేయాలని ఆదేశించింది. హాజరు కాకపోతే NBW జారీ అవుతుందని స్పష్టం చేశారు.