High alert in Hyderabad : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద జరిగిన కారులో జరిగిన పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ప్రాథమిక దర్యాప్తుల ప్రకారం, కారులో పేలుడు పదార్థాలు ఉండటంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు, ఫైర్ సర్వీసెస్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టాయి. ఈ పరిణామంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లతో పాటు హైదరాబాద్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులు వాహన తనిఖీలు, పెట్రోలింగ్‌ను పెంచారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీ పేలుడు సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని అన్ని 6 జోన్లలో పెట్రోలింగ్‌ను పెంచారు. రవాణా మార్గాలు, మార్కెట్లు, మాల్స్, మెట్రో స్టేషన్‌ల వద్ద వాహన తనిఖీలు ప్రారంభించారు. సైబర్ టీమ్‌లు సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తున్నాయి. "ఢిల్లీ ఘటనతో మేము అలర్ట్‌లో ఉన్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
సెంట్రల్, సౌత్, ఈస్ట్ జోన్లలో ప్రత్యేక స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. పాతబస్తీ, హైటెక్ సిటీ, హుస్సేన్ సాగర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో CCTVలు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఢిల్లీ పోలీసులతో కూడా సమన్వయం చేస్తోంది. ఈ
ప్రజలకు జాగ్రత్తలు: పోలీసుల సూచనలుహైదరాబాద్ పోలీసులు ప్రజలకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు:అనుమానాస్పద వాహనాలు/వ్యక్తులు : కనిపిస్తే వెంటనే పోలీసులకు (100) ఇన్ఫర్మ్ చేయండి.సోషల్ మీడియా : ఫేక్ న్యూస్, రూమర్లు షేర్ చేయకండి. వెరిఫై చేసి మాత్రమే పోస్ట్ చేయండి.పబ్లిక్ ప్లేసెస్ : మాల్స్, మార్కెట్లు, మెట్రోలో బ్యాగ్‌లు, వాహనాలు తనిఖీలకు సహకరించండి.ఎమర్జెన్సీ : పేలుడు సందేహం ఉంటే ప్రదేశాన్ని వదిలి వెళ్లాలి. ఫైర్ ఆలారమ్‌లు ఆన్ చేయండి