harish Rao : టాన్‌చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని...ఈ విషయం రజనీకి అర్థమైంది కానీ.. గజనీలకు మాత్రం కావట్లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదన్నారు.
గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్‌రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ వద్దన్నట్లే - ఇక షర్మిల ఏం చేయబోతున్నారు ?
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో కొల్లూరు టౌన్‌షిప్‌లో విద్య, వైద్యం, రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి రజినీకాంత్‌కు అర్థమైంది కానీ.. మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలే ప్రచారం చేయాలని అన్నారు. హైదరాబాద్‌లో లక్షమందికి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇండ్లు ఇస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా చేస్తామని భరోసానిచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా రెడీ - దసరా కల్లా పూర్తి లిస్ట్ ప్రకటించే చాన్స్ !
ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు, నినాదాలు చేస్తూ మీ దగ్గరికి వస్తుంటారని అన్నారు. దొంగ డిక్లరేషన్ చేస్తూ.. ఓట్ల కోసం వస్తున్నారన్నారు. ఎన్ని డిక్లరేషన్‌లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులో ఏపీ అక్రమంగా వేసిన కేసు కొట్టుడు పోయాయని అన్నారు