Hyderabad Traffic Diversions: హైదరాబాద్ లో ఏప్రిల్ 23 మంగళవారం నాడు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవెర్షన్ లు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ మళ్లింపులు ఉండే మార్గాలను కూడా సీపీ ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్ బండ్ హానుమాన్ మందిర్ వరకు విజయ యాత్ర జరుగుతుందని సీపీ తెలిపారు. ఆ యాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 


గౌలిగూడ రామమందిరం నుంచి హనుమాన్ జయంతి విజయ యాత్ర ప్రారంభమై శంకర్ షేర్ హోటర్, బడేమియా పెట్రోల్ పంప్, గౌలిగూడ చమాన్, రంగ్ మహల్ జంక్షన్, జీపీవో, యూసుఫియాన్ కంపెనీ, డీఎం అండ్ హెచ్ఎస్, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్, కాచిగూడ ఎక్స్ రోడ్స్, బొగ్గుల కుంట ఎక్స్ రోడ్స్, ఈడెన్ గార్డెన్, లింగంపల్లి ఎక్స్ రోడ్స్, వైఎంసీఎ- నారాయణగూడ, షాలిమర్, వాటర్ ట్యాంక్ నారాయణగూడ, బర్కత్ పుర పోస్టాఫీస్, నారాయణగూడ ఫ్లై ఓవర్, క్రౌన్ ఓవర్ ఫ్లై ఓవర్, మెట్రో కేఫ్, వీఎస్టీ ఎక్స్ రోడ్, ఇందిరాపార్క్, గాంధీ నగర్ టి జంక్షన్, స్ట్రీట్ నెంబర్ 9 హెచ్- నగర్, గాంధీ నగర్ టి జంక్షన్, కవాడీగూడ, డీబీఆర్ మిల్, బైబిల్ మిల్, సైలింగ్ క్లబ్, బైబిల్ హౌజ్, కార్బాలా మైదాన్, కవాడీ గూడ, ప్యాట్నీ, రాణిగంజ్, సీటీవో, సీటీవో ఫ్లైఓవర్ రెండు వైపులా, బలమరాయ్, సేఫ్ ఎక్స్ ప్రెస్, బోయిన్ పల్లి ఎక్స్ రోడ్స్, తివోలీ, డైమండ్ పాయింట్, బోయిన్ పల్లి మార్కెట్, మస్తాన్ హోటల్ ఏరియాల మీదుగా హనుమాన్ యాత్ర సాగుతుందని తెలిపారు. 


అటు రాచకొండ ప్రాంతంలో కూడా శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి గాంధీ స్ట్రాట్యూ రోడ్, చంపాపేట ఎక్స్ రోడ్, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్, సైదాబాద్ వై జంక్షన్, హనాఫియా మసీద్, సరూర్ నగర్ పోస్టాఫీస్, విక్టోరియా హోమ్, కొత్తపేట జంక్షన్, మూసారాంబాగ్, నల్గొండ ఎక్స్ రోడ్, ఛాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్, డీఎంఅండ్ హెచ్ మీదుగా ఈ యాత్ర ప్రధాన హనుమాన్ యాత్రలో కలవనుంది. 


హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ఈ ప్రాంతాల గుండా వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు, అంతరాయాలు, రాకపోకలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.