GHMC Jobs: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నట్టు అధికారులు తెలిపారు.

Continues below advertisement

అందుబాటులో ఉన్న ఉద్యోగాలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు అందించే సేవలను మరింత మెరుగు పరిచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేశారు. 17 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (ఐటీ), డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రత్యేక లింక్: https://ghmc.gov.in/MSUApplicationForm.aspx ద్వారా సమర్పించాలని GHMC స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 03, 2025న ప్రారంభమై, అక్టోబర్ 18, 2025 తో ముగుస్తుంది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించి, సంబంధిత పత్రాల స్వీయ-ధృవీకరించిన కాపీలను గడువు తేదీలోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో జరిగే అన్ని అధికారిక సంభాషణలు కేవలం అభ్యర్థులు అందించిన చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ల ద్వారా మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు.

Continues below advertisement

కీలకమైన మరియు అత్యధిక వేతన పోస్టులు:

ఈ రిక్రూట్‌మెంట్‌లో అత్యంత ముఖ్యమైన పోస్ట్ సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఈ ఒక్క పోస్ట్‌కు గరిష్టంగా రూ. 1,75,000 వరకు వేతనం అందుతుంది. అయితే, వేతనం అభ్యర్థి విద్యార్హతపై ఆధారపడి ఉంటుంది.

1. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ (1 పోస్ట్):    ◦ అర్హతలు: అభ్యర్థి వయస్సు 60 సంవత్సరాలు మించకూడదు. గుర్తింపు పొందిన MCI నుంచి MBBSతోపాటు MD (PSM/కమ్యూనిటీ మెడిసిన్)/ MD (CHA) / MD (ట్రాపికల్ మెడిసిన్) లేదా DNB (సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/కమ్యూనిటీ మెడిసిన్) ఉండాలి.    ◦ లేదా MBBSతో EIS శిక్షణ కోర్సు సర్టిఫికేట్ కలిగి ఉండాలి.    ◦ లేదా B.Sc. (లైఫ్ సైన్సెస్/BDS/BPT)తోపాటు MPH (ఎపిడెమియాలజీ) / DPH (ఎపిడెమియాలజీ) లేదా MAE (అప్లైడ్ ఎపిడెమియాలజీ) కలిగి ఉండి, ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత తర్వాత పబ్లిక్ హెల్త్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.    ◦ అనుభవం: అంటువ్యాధుల నియంత్రణపై దృష్టి సారించి, పబ్లిక్ హెల్త్ కార్యక్రమాలను అమలు చేయడంలో అర్హత పొందిన తర్వాత కనీసం 10 సంవత్సరాల క్షేత్రస్థాయి అనుభవం తప్పనిసరి.    ◦ వేతనం: MBBS+MD/DNB ఉన్న వారికి రూ. 1,75,000, MBBS + EIS ఉన్న వారికి రూ. 1,50,000, B.Sc. ఇన్ లైఫ్ సైన్సెస్ వారికి రూ. 1,25,000.

2. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ (1 పోస్ట్):

అప్లై చేసే అభ్యర్థి వయసు 50 ఏళ్లు మించకూడదు. అర్హతలు దాదాపు సీనియర్ పోస్ట్‌తో సమానంగా ఉన్నప్పటికీ, అనుభవం కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. వేతనం అర్హతను బట్టి రూ. 90,000 నుంచి రూ. 1,25,000 వరకు ఉంటుంది.

3. మైక్రోబయోలజిస్ట్ (1 పోస్ట్):

అప్లై చేసే అభ్యర్థి వయసు 50 ఏళ్లు మించకూడదు.    ◦ అర్హతలు: MBBSతోపాటు MD/DNB (మెడికల్ మైక్రోబయాలజీ/ల్యాబ్ మెడిసిన్) లేదా M.Sc. (మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ) తో పాటు PhD ఉండాలి.    ◦ అనుభవం: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/PhD పొందిన తర్వాత క్లినికల్ మైక్రోబయాలజీ ల్యాబ్‌లో/పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.    ◦ వేతనం: మెడికల్ వారికి రూ. 1,25,000, నాన్-మెడికల్ వారికి రూ. 1,00,000.

మరికొందరు నిపుణుల అవసరం:

GHMC కేవలం వైద్యులను మాత్రమే కాకుండా, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నియంత్రణకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను కోరుతోంది.

• ఎంటమాలాజిస్ట్ (1 పోస్ట్): అప్లై చేసే అభ్యర్థి వయసు 50 ఏళ్లు మించకూడదు. M.Sc.(ఎంటమాలజీ/జువాలజీ) చేసి, పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ ఉన్న వ్యాధులకు సంబంధించిన ఎంటమలాజికల్ పరిశోధనలలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వేతనం రూ. 75,000.

• వెటర్నరీ ఆఫీసర్ (1 పోస్ట్): అప్లై చేసే అభ్యర్థి వయసు 50 ఏళ్లు మించకూడదు. వెటర్నరీ పబ్లిక్ హెల్త్ లేదా వెటర్నరీ ఎపిడెమియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వ్యాధి నిఘా, అవుట్‌బ్రేక్ దర్యాప్తులో కనీసం 5 సంవత్సరాల అనుభవం కోరుతోంది. వేతనం రూ. 75,000.

• ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ (1 పోస్ట్): అప్లై చేసే అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదు. ఆహార భద్రతలో మైక్రోబయల్ పరిశోధనలలో 5 సంవత్సరాల అనుభవం (బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత) లేదా 3 సంవత్సరాల అనుభవం (మాస్టర్స్ డిగ్రీ తర్వాత) అవసరం. వేతనం రూ. 50,000.

పరిపాలన- సాంకేతిక నిపుణుల పాత్ర:

ఆరోగ్య నిపుణులతో పాటు, పరిపాలన, డేటా నిర్వహణకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి:

• టెక్నికల్ ఆఫీసర్ (ఐటీ): అప్లై చేసే అభ్యర్థి వయసు 50 ఏళ్లు మించకూడదు. M.Tech/MCA/MBA(IT) వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో 4 సంవత్సరాల అనుభవం. వేతనం రూ. 75,000.

• డేటా అనలిస్ట్: అప్లై చేసే అభ్యర్థి వయసు 45 ఏళ్లు మించకూడదు. MS Office, SPSS, STATA వంటి స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్‌లో నైపుణ్యంతో పాటు, డేటా అనాలిసిస్‌లో 5 సంవత్సరాల అనుభవం అవసరం. వేతనం రూ. 60,000.

• కమ్యూనికేషన్ స్పెషలిస్ట్: అప్లై చేసే అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదు. మాస్ కమ్యూనికేషన్/డిజిటల్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో 3 సంవత్సరాలు లేదా డిప్లొమాతో 5 సంవత్సరాల అనుభవం అవసరం. వేతనం రూ. 50,000.

• అడ్మిన్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, ట్రైనింగ్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీపర్పస్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఎంపిక నిబంధనలు:

ఈ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థులను ఎంపిక చేసే విధానం చాలా పారదర్శకంగా,  మార్కుల ఆధారంగా ఉంటుంది.విద్యార్హత - 80 మార్కులుఅనుభవం - 10 మార్కులుఇంటర్వ్యూ - 10 మార్కులుమొత్తం- 100 మార్కులు

అనుభవానికి ప్రతి సంవత్సరం ఒక మార్కు చొప్పున, గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పొందిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉన్నత విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

ముఖ్య నిబంధనలు (కాంట్రాక్ట్ వివరాలు):

ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో 12 నెలల కాలానికి కాంట్రాక్ట్ ఉంటుంది. నిధుల  నిర్వహించిన విధానం ఆధారంగా కాంట్రాక్ట్ కొనసాగింపు ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు సంస్థలో రెగ్యులర్ సర్వీస్ కోసం క్లెయిమ్ చేయడానికి అర్హులు కారు. వారికి నిర్ణీత వేతనం తప్ప ఇతర అలవెన్సులు చెల్లించరు. ఎంపికైన వారు రూ.100/- నుంచి రూ. 500/- లీగల్ బాండ్ పేపర్‌పై కాంట్రాక్ట్ ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

GHMC పరిపాలన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఒత్తిడి తెచ్చినా, తప్పుడు సమాచారం సమర్పించినా, లేదా అనైతిక మార్గాలను అవలంబించినా అభ్యర్థిని తక్షణమే అనర్హుడిగా పరిగణిస్తుంది. కాంట్రాక్ట్ అభ్యర్థి పని అసంతృప్తికరంగా ఉంటే, ముందస్తు నోటీసు లేకుండానే సేవల నుంచి తొలగిస్తారు.