జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యే రాజసింగ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 


బీఆర్ఎస్ సర్కారు రాజకీయాలను అవినీతి మయం చేసిందని రాజసింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన తెలంగాణను అప్పుల పాలు చేశాయని ధ్వజమెత్తారు. 


 మున్సిపల్ కాంట్రాక్టర్లకు(Municipal Contractors) వెంటనే బిల్లులు  చెల్లించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ (GHMC) నిధులను బీఆర్ఎస్ నేతలు  సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ నిధులను కేసీఆర్ సర్కార్  ఎన్నికల‌‌ కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిందని ఆరోపించారు.


జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చేయకుండా ఎన్నికలకు వెళ్ళితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరమికొడతారన్నారు. ధనిక‌ రాష్ట్రమని పదే పదే చెప్పే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించటం‌ లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవటం వలన నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని రాజాసింగ్ పేర్కొన్నారు.


కార్పొరేషన్ కు సంబంధించిన అత్యవసర పనులకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు చెల్లింపులు జరగలేదని చెప్పారు. పలుసార్లు అధికారులతో నగర మేయర్ తో చర్చించినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని కాలయాపన చేస్తున్నారని రజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు విడుదల చేకపోతే కార్యాలయం ముందు వినూత్న నిరసన చేపడతామని చెప్పరు.


  అక్కడే  వంట వర్పు కూడా ఏర్పాటు చేసి నిరసనను తెలుపుతా మని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకొని బిల్లులు చెల్లించని ఎడల ఆందోళనలు తీవ్ర రూపం చేస్తామని వివిధ విభాగాల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా ఇదివరకు తమ నిరసన తెలిపారని రాజాసింగ్ చెప్పారు. పనులు నిలిపివేసి నిరసన తెలియజేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 


సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఆస్పత్రిలో చేర్పించకుండా ఫామ్ హౌస్ లో ఉంచడం ఏమిటని రాజాసింగ్ ప్రశ్నించారు. సీఎం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్ర మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికి వారే సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దొంగ నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు వెల్లడించిన అందులో అభ్యర్థులకు న్యాయం జరగలేదని చెప్పారు.


రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారని ఎమ్మెల్యే రాజాసింగ్ జోష్యం చెప్పారు. తెలంగాణలో కుటుంబ పార్టీ ఫార్ములా ఒక్కటేనని అది అందిన కాడికి దోచుకోవడమే ఫార్ములాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన వల్ల ప్రజలు అలసిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసంతో లేరని చెప్పారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో వైఫల్యాలు తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఆరోపించారు. ప్రజల ఆశలకు ఆశలకు అనుగుణంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.