Ganesh Chaturthi 2025: హైదరాబాద్ లో  ఘనంగా జరిగే గణేశ్ నిమజ్జనంకు వచ్చే ప్రయాణికుల కోసందక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  వచ్చే రద్దీకి అనుగుణంగా రైళ్లను నడిపాలని నిర్ణయం తీసుకుంది.  గణేశ్ నిమజ్జనంకు వచ్చే భక్తుల కోసం రాత్రివేళల్లో కూడా ప్రత్యేకంగా MMTS రైళ్లు నడపేందుకు  ఏర్పాట్లు చేసింది.  సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి  ఎనిమిదో తేదీ వరకు  రాత్రి పది గంటల నుండి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు   ఎం.ఎం. టీ.ఎస్ రైలు సర్వీసులు గణేశ్ భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 
 

 ఆ వివరాలు ఇవే..............

        ప్రత్యేక రైళ్లు నడిచే తేదీలు

• సెప్టెంబర్ 6 వ తేదీ రాత్రి, 7వ తేదీ రాత్రి, 8వ తేదీ రాత్రి
 
• సమయం: రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు

MMTS  రైళ్ల షెడ్యూల్

  • •రాత్రి 11:50కు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్
  • •అర్ధరాత్రి 12:30కు హైదరాబాద్ నుంచి లింగంపల్లి
  • •రాత్రి 1:50కు లింగంపల్లి నుంచి హైదరాబాద్
  • •రాత్రి 3:30కు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్
  • •రాత్రి 11:10కు హైదరాబాద్ నుంచి లింగంపల్లి
  • •అర్ధరాత్రి 12:10కు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా
  • •రాత్రి 2:20కు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్
  • •తెల్లవారుజామున 4:00కు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్
 ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యలోని అన్ని MMTS స్టేషన్లలో ఆగనున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గణేస్ నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులకు అర్థరాత్రి నుంచి నాల్గింటి వరకు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.