కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి

Jagga ReddY News: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన హస్తినకు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Continues below advertisement

Sangareddy News: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) ఢిల్లీ (Delhi)కి వెళ్లారు. కాంగ్రెస్ (Congress)హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన హస్తినకు వెళ్లారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revnath Reddy)తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Continues below advertisement

సంగారెడ్డి (Sangareddy)నుంచి భవిష్యత్ లో పోటీ చేసేది లేదని చెప్పారు. అయితే మెదక్ పార్లమెంట్ టికెట్ ను తన భార్య,  సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమార్తె జయారెడ్డి కోసం టికెట్ అడుగుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీలో సీనియర్ నేత కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తుందా ? పార్టీ పదవి ఇస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసమే జగ్గారెడ్డిని కాంగ్రెస్ హైకమండ్ ఢిల్లీకి పిలిపించిందా అన్న వార్తలు వస్తున్నారు. 

Continues below advertisement