Ammonia Gas Leak : హైదరాబాద్ ఫతేనగర్ లో అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ కారణంగా పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. పైప్ లైన్ రోడ్డు చివరన చెత్త కుప్పల్లో చాలా కాలం నుంచి రెండు అమ్మోనియా గ్యాస్ సిలిండర్లు పడి ఉన్నాయి. అయితే వీటిని గమనించిన ఓ దొంగ.. గ్యాస్ సిలిండర్లకు ఉన్న ఇత్తడి వాల్వ్‌లు తీసుకునేందుకు ప్రయత్నించాడు. రాడ్డుతో కొట్టి మరీ సిలిండర్ వాల్స్ ను తొలగించబోయాడు. దాంతో సిలిండర్ నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈక్రమంలోనే 15 మీటర్లకుపైగా గాల్లోకి గ్యాస్ వ్యాపించింది. పక్కనే ఉన్న కంపెనీలో పని చేసే 10 మంది బిహార్ కార్మికులకు అస్వస్థత కాగా.. కాలనీలో నివాసం ఉంటున్న మరో ఐదుగురూ అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Ammonia Gas Leak: హైదరాబాద్ ఫతేనగర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ - 15 మందికి అస్వస్థత
ABP Desam
Updated at:
30 Jun 2023 10:59 AM (IST)
Edited By: jyothi
Ammonia Gas Leak : హైదరాబాద్ ఫతే నగర్ లో అమ్మోనియా గ్యాస్ లీకై 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫతేనగర్ గ్యాస్ లీక్