Drunk and Driving Rules in Telangana | నూతన సంవత్సర వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలుకాబోతున్నాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలు అధికంగా జరుగుతాయి. కొందరు మద్యం సేవించి, తాగిన మత్తులోనే వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం అనేది తెలంగాణలో అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం, ఎవరైనా మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి ₹10,000 జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, లేదా కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించవచ్చు. అంతేకాకుండా, నిబంధనలను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలల వరకు సస్పెండ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. రహదారి భద్రతను మెరుగుపరచడానికి 2019 సవరణల ప్రకారం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.
రిపీట్ చేసిన వారిపై కఠిన చర్యలుమొదటిసారి నేరం చేసిన మూడు సంవత్సరాల లోపు గనుక ఎవరైనా రెండోసారి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, శిక్షలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో జరిమానాను ₹15,000 కు పెంచడంతో పాటు, జైలు శిక్షను 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నాన్-బెయిలబుల్ (Non-bailable) కేస్‌లుగా పరిగణించనున్నారు. వాహనాలు నడిపే వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సమయంలో ఎవరైనా పట్టుబడితే ా వాహనాలను తక్షణమే సీజ్ చేయనున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు.
చట్టపరమైన ఆల్కహాల్ పరిమితిచట్టం ప్రకారం, ఒక వ్యక్తి రక్తంలో ఆల్కహాల్ స్థాయి 100 ml రక్తానికి 30 mg (0.03%) కంటే ఎక్కువగా ఉంటే దానిని నేరంగా పరిగణిస్తారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఈ పరిమితి దాటినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు. కాబట్టి వాహనదారులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మద్యం సేవించినప్పుడు వాహనం నడపకుండా ఉండటం ఉత్తమమని హైదరాబాద్ పోలీసులు సూచించారు.
Disclaimer: ఈ వీడియో కేవలం సాధారణ సమాచారం & అవగాహన కోసం మాత్రమే రూపొందించారు. ఇది లీగల్ అడ్వైస్ (Legal Advice) మాత్రం కాదు. చట్టాలు రాష్ట్రాల వారీగా లేదా కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. కచ్చితమైన సమాచారం కోసం ట్రాఫిక్ పోలీస్ / లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పై వీడియోను తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.