South Central Railway News In Telugu: దీపావళి పండక్కి ఊరికి వెళ్తున్నారా? ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే కొన్ని స్పెషెల్ రైళ్లను కొన్ని ఎంపిక చేసిన రూట్లలో నడుపుతోంది. దీపావళికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందుకు ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. ఈ కొత్త స్పఎషల్ రైళ్లకి సంబంధించి రైళ్ల రాకపోకలు సాగించే డేట్లు, ఆ రైళ్ల నెంబర్లతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రత్యేక చార్ట్‌లను విడుదల చేశారు. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల మధ్య నడవనున్నాయి. 


సికింద్రాబాద్ నుంచి బిహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో ఉన్న రక్సౌల్ వరకూ ప్రత్యేకంగా నాలుగు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్‌ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌ మీదుగా వెళ్లనున్నాయి. ఈ నాలుగు జన్‌ సాధారణ్‌ ప్రత్యేక రైళ్లను నవంబర్‌ 9 నుంచి 30వరకు ఎంపిక చేసిన తేదీల్లో నడవనున్నాయి.