Diversion of Trains via Charlapalli Railway Station instead of Secunderabad | హైదరాబాద్‌: సిటీ నుంచి రైలు ప్రయాణం చేసే వారు ఈ విషయం గమనించాలి. దక్షిణ మధ్య రైల్వే 4 రైళ్లను టెర్మినల్‌ మార్చుతూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ (Secunderabad Railway Station) నుంచి రాకపోకలు సాగించే 4 రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌ (Cherlapally Railway Station)కు, ఒక్క రైలును కాచిగూడ రైల్వేస్టేషన్‌కు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో పనులు జరుగుతున్న కారణంగా అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని టెర్మినల్ మార్చేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది.  కొన్ని రోజుల కిందటే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. రూ.720 కోట్ల వ్యయంతో దశల వారీగా సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ మెంట్ చేపడుతున్నామని ద.మ రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి టెర్మినల్ మారిన రైళ్ల వివరాలు..- లింగంపల్లి- విశాఖపట్నం (రైలు నెంబర్ 12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7 గంటల15 నిమిషాలకి చర్లపల్లికి వస్తుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం- లింగంపల్లి రైలు (రైలు నెంబర్ 12805) సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు చర్లపల్లికి చేరుతుంది. ఏప్రిల్‌ 25 నుంచి రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.- తిరుపతి- ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెంబర్ 17405) చర్లపల్లి టెర్మినల్‌ నుంచి రాత్రి 8 గంటల 10 నిమిషాలకి బయలుదేరుతుంది. బొల్లారం స్టేషన్‌లో రాత్రి 9 గంటల 14 నిమిషాలకి ఆగుతుంది. ఆదిలాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (నెంబర్ 17406) బొల్లారం స్టేషన్‌కు ఉదయం 4 గంటల 29 నిమిషాలకు, చర్లపల్లికి ఉదయం 5 గంటల 45 నిమిషాలకి వస్తుంది. ద.మ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం మార్చి 26 నుంచి అమల్లోకి రానుంది.- కాజీపేట- హదాప్పర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెంబర్ 17014) చర్లపల్లికి రాత్రి 8 గంటల 20 నిమిషాలకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 17013 తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లికి వస్తుంది.  ఏప్రిల్‌ 22 నుంచి ఈ నిర్ణయ అమల్లోకి వస్తుంది.- కాకినాడ- లింగంపల్లి మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ (రైలు నెంబర్ 07446) ఉదయం చర్లపల్లి నుంచి 7 గంటల 20 నిమిషాలకి బయల్దేరుతుంది. లింగంపల్లికి 9 గంటల 15 నిమిషాలకి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 07445 లింగంపల్లి నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి బయలుదేరి రాత్రి 7 గంటల 30 నిమిషాలకి చేరుతుంది. ఏప్రిల్‌ 2 నుంచి జులై 1 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

సికింద్రాబాద్ నుంచి కాచిగూడకు మార్పు..

సికింద్రాబాద్ నుచి కాచిగూడకు సైతం రైలు టెర్మినల్ మార్చారు. కాచిగూడ- సికింద్రాబాద్ (రైలు నెంబర్ 17023) ఉదయం 7 గంటల 57 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కర్నూలు సిటీకి చేరుతుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో కర్నూలులో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల 55 నిమిషాలకు కాచిగూడ చేరుతుంది.