Dil Raju Son In Law: ‘నేనెవరో తెలిస్తే షాక్ అవుతారు. నీకు ఆకాష్ అంబానీ తెలుసా..? అతని పీఏ నేను, హృతిక్ రోషన్‌కు మేనేజర్‌ను.. మేము అందరం బాగా క్లోజ్. కేటీఆర్ నా ఫ్రెండే. మేము అంతా టూర్‌కు వెళ్తాం. కేటీఆర్ కార్ తీసుకెళ్లమన్నాడు’ అంటూ ఓ వ్యక్తి ఏకంగా పోలీసులనే దబాయించాడు. ఖరీదైనా కారు చేసి పట్టుబడిన వ్యక్తి ఇలా సమాధాలను ఇచ్చాడు. ఆ కారు చిన్నాచితకది కాదు.. దాని విలువ ఏకంగా రూ.1.7 కోట్లు. అంతేకాదు కారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడిది. కారు చోరీ చేసి పట్టుబడిన నిందితుడు చెప్పిన సమాధానాలు విని పోలీసులకు ఒక్క నిమిషం షాకయ్యారు. తేరుకుని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
ప్రముఖ నిర్మాత అల్లుడికి చెందిన రూ.కోటిన్నరకుపైగా విలువైన పోర్షే కారును ఓ వ్యక్తి చోరీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు గంటలోనే కారు జాడను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7కోట్ల విలువైన తన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ కారును హోటల్ వద్ద నిలిపి లోపలికి వెళ్లారు.
అంతుకుముందే మల్లెల సాయికిరణ్ అనే యువకుడు స్కూటీపై హోటల్ పార్కింగ్ స్థలం వద్దకు వచ్చాడు. ఖరీదైన కార్లకోసం వెతికాడు. ఈ సమయంలోనే అర్చిత్ రెడ్డి పోర్షే కారులో రావడంతో సాయికిరణ్ కళ్లు ఆ కారుపై పడ్డాయి. అర్చిత్ రెడ్డి లోపలికి వెళ్లిన తరువాత కారు దగ్గరకు వెళ్లిన కిరణ్ కారును చాకచక్యంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. 40 నిమిషాల తరువాత తిరిగి వచ్చిన అర్చిత్‌రెడ్డి కారు కోసం చూడగా కనిపించలేదు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. రూ.1.7 కోట్లు విలువ చేసే తన కారు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఐ వీరశేఖర్, ఎస్సై రాజశేఖర్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సిబ్బందిని రంగంలోకి దించి సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. కారును నిలువరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నేను ఆకాష్ అంబానీ పీఏని
పోలీసుల విచారణలో నిందితుడి సమాదానలు విని తలలు పట్టుకున్నారు. తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, తాను తన సహాయకుడు హృతిక్‌రోషన్ మేనేజర్‌ను అని చెప్పుకొచ్చాడు. కారులో అకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందన్నాడు. మంత్రి కేటీఆర్ తాను క్లోజ్ అని, ఆయనే కారు తీసుకెళ్లాలని సూచించారంటూ చెప్పాడు. అతని మాటలతో కంగుతిన్న పోలీసులు తలలు పట్టుకున్నారు.
వెంటనే అతని కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్ చేశారు. వారు సంచలన విషయాలు చెప్పారు. అతనికి మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు గుర్తించారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. గతంలోనూ అతనిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఓ క్రిమినల్ కేసు ఉన్నట్లు గుర్తించారు. చివరికి నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. కారును దిల్ రాజు అల్లుడికి అప్పగించారు.