Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్

Smitha Sabarwal Issue: ఉద్యోగంలో పదోన్నతలు గురించి మాట్లాడేందుకు మాత్రమే తాను స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లినట్లు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి తెలిపారు.  

Continues below advertisement

Smitha Sabarwal Issue: ఉద్యోగంలో పదోన్నతుల గురించి చర్చించేందుకు మాత్రమే తాను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లినట్లు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి పోలీసులకు తెలిపారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న వారిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు 9 మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయం మాట్లాడేందుకు తాను స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లినట్లు ఆయన వివరించారని పోలీసులు చెబుతున్నారు. రాత్రివేల ఎందుకు వెళ్లారని అడిగిన ప్రశ్నకు సమాధానం లేదని పేర్కొన్నారు. అయితే 1996 గ్రూపు-2 లో ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపు 26 మంది అభ్యర్థుల పోస్టింగులు కోర్టు వివాదంతో రద్దు అయ్యాయని.. 2018లో మళ్లీ కోర్టు జోక్యంతో డిప్యూటీ తహసీల్దార్లలాగా పోస్టింగులు వచ్చాయని అన్నారు. వారిలో 16 మందిని పీకి కేటాయించగా... 10 మందికి తెలంగాణలో పోస్టింగులు వచ్చాయన అందులో తాను ఒకడినని డీటీ చెప్పినట్లు వెల్లించారు. ఏపీకి వెళ్లిన వారికి పదోన్నతులు రాగా తామింకా డీటీలుగానే ఉన్నామనే విషయాన్ని చెప్పేందుకు వెళ్దామనుకున్నానని పేర్కొన్నట్లు తెలిపారు. 

Continues below advertisement

అసలేం జరిగిందంటే..?

తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్... హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆమె చేసిన ట్వీట్లకు ఓ డిప్యూటీ తహసీల్దార్ ఒకరి రెండు సార్లు రీట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని అతని వెంటతీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్ తెలిచిన మహిళా ఐఏఎస్ కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భయపడిపోయారు. తేరుకున్న ఆమె, నువ్వెవరు, ఎందుకొచ్చావని అని గట్టిగా ప్రశ్నించింది. అందుకు అతను గతంలో నేను మీకు ట్వీట్ చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గుర్తైన ఆమె బయటకి వెళ్లాలని చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఆందోళన వ్యక్తం చేసిన స్మితా సబర్వాల్  

ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.  రాత్రి  ఊహించని సంఘటన ఎదురైంది. అత్యంత బాధాకరమైన ఘటన జరిగిందన్నారు.  రాత్రి  ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు.. అప్రమత్తతో నా ప్రాణాలు కాపాడుకున్న.. మీ ఇంటికి తాళాలు వేసుకోండి... తలుపు తాళాలను తనిఖీ చేసుకోండి.. అత్యవసర పరిస్థితిలో డయల్ 100కు కాల్ చేయండని ప్రజలకు సలహా ఇచ్చారు.  

Continues below advertisement