DCP Chaitanya opens fire on cell phone thieves in Hyderabad: హైదరాబాద్   చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో.. కాల్పులు చోటు చేసుకున్నాయి. సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకునేందుకు వెళ్లిన  డీసీపీ చైతన్యపై వారు కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిపై చైతన్య కాల్పులు  జరిపారు. ఓ దొంగకు గాయాలు కావడంతో నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. 

Continues below advertisement

సౌత్ ఈస్ట్ డీసీపీగా ఉన్నచైతన్య సెల్ ఫోన్ దొంగల గురించి సమాచారం రావడంతో విక్టోరియా గ్రౌండ్స్ వైపు వెళ్లారు. ఆయనతో  పాటు సిబ్బంది కూడా వెళ్లారు. అక్కడ ఉన్న  దొంగల్ని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగలు తిరగబడ్డారు. కత్తులతో దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో డీసీపీ చైతన్య గన్ మెన్ కిందపడిపోయారు. చైతన్యపై కత్తితో దాడికి దొంగలు ప్రయత్నించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో వెంటనే డీసీపీ చైతన్య తన  గన్‌మెన్ వద్ద  నుంచి తుపాకీ తీసుకుని దొంగలపై కాల్పులు జరిపారు. ఓ దొంగకు బుల్లెట్ గాయం అయింది.. మరో దొంగ తప్పించుకుని పారిపోయినట్లుగా గుర్తించారు. గాయపడిన దొంగను ఆస్దపత్రికి తరలించారు. ఘటనా ప్రదేశానికి .. కమిషనరక్ సజ్జనార్ వెంటనే వెళ్లారు. పోలీసు సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని ఆయన తెలిపారు.   

దొంగలు ఇద్దరూ పాతబస్తీకి చెందిన పాత నేరస్తులుగా భావిస్తున్నారు.  వీరిద్దరిపై గతంలో చాలా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.  పోలీసులపైనే దాడికి ప్రయత్నించారంటే..దేనికైనా తెగిస్తారన్న ఉద్దేశంతో డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్లుగా  పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

ఆ ఇద్దరు దొంగలు తండ్రీ కొడుకులు - కరుడుగట్టిన నేరస్తులు             

పోలీసులు ఆ ఇద్దరు దాడులకు తెగబడిన ఆ ఇద్దరు దొంగలు తండ్రీ కొడుకులు అని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఒకరి పేరు అన్సార్.. మరొకరి పేరు ఒమర్.  చార్మినార్ చూసేందుకు వచ్చేవారు... ఆ చుట్టుపక్కల షాపింగ్ కు  వచ్చే పర్యాటకుల ఫోన్లను స్నాచింగ్ చేసేవారని చెబుతున్నారు. వారిపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి.  పోలీసులని కూడా లెక్క చేసే వారు కాదని చెబుతున్నారు.  కొద్ది రోజులుగా వారు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఒమర్ పై రౌడీషీట్ కూడా ఉందని.. ఆయన హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాెంటెడ్ రౌడీషీటర్ అని పోలీసులు చెబుతున్నారు. ఆయనే ఇప్పుడు బుల్లెట్ గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఒమర్ ఆర్థిక పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.