Thunderstrom for entire Hyderabad City: హైదరాబాద్ సిటీలో హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఉదయం అత్యంత వేడితో కూడిన ఎండ ఉండగా..మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. హఠాత్తుగా క్యూమూలో నింబస్ మేఘాలు కమ్ముకు వచ్చాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
క్యూములో నింబస్ మేఘాలు శరవేగంగా కమ్ముకున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గాలులు కూడా వస్తాయన్నారు.
తమ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. [tw]
హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో నగర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దన్న వాతావరణ శాఖ సూచించింది.