Congress EX MP Ponnam Prabhakar: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. అధికార టీఆర్ఎస్.. విపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పే ముచ్చట అక్బర్ బీర్బల్ కథల్లా ఉంటాయని, ఆయన వంకాయ కూర బాగుందంటే.. బాగుందని భజన బ్యాచ్ అంటున్నారంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, ఇంకా దేశ రాజకీయాలపై చర్చలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారని, దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.


బీజేపీకి వెన్నంటి నిలిచే పార్టీ టీఆర్ఎస్
ప్రతి విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. మొదటి నుండి బీజేపీ మద్దతిచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని, జీఎస్టీ నుంచి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచిండు అని గుర్తుచేశారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్, ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏమైందని సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర మంత్రులను పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు 
మునుగోడు (Munugode Bypolls)లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని.. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు లేదు. ఇక మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తాను కూడా ప్రచారానికి వెళ్తానన్నారు. సీనియార్టీ వచ్చినప్పుడు గాంధీ భవన్ మీటింగ్ లో, ప్రియాంక గాంధీ వద్ద మీటింగ్ లో హాజరవుతా అని చెప్పారు. అప్పటి వరకు తన సొంత నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. 
కాంగ్రెస్ హయాంలో సంక్షేమం, టీఆర్ఎస్ పాలనలో త్రీడీ షో !
కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని సీఎం కేసీఆర్ కు సూచించారు పొన్నం. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినం. కానీ టీఆర్ఎస్ పాలనలో త్రీడి షో తప్పా ఏమి లేదని ఎద్దేవా చేశారు. కొత్త బిచ్చగాళ్లలా టీఆర్ఎస్, బీజేపీ నేతలు కొట్లాడుకుంటున్నారని.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రేషన్ షాపుల వద్ద, మరుగు దొడ్ల వద్ద మా ఫొటోలు లేవంటే మా ఫొటోలు లేవని కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు సలహా ఇచ్చారు.

Also Read: Munugodu Bypoll: మునుగోడులో కాంగ్రెస్‌ వ్యూహం ఫలించేనా ! కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ తప్పదా !


Also Read: Ys Sharmila Comments: ఎవర్రా నీకు మరదలు, మెట్టుతో కొడతాను - మంత్రిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు