Telangana Crime News: హైదరాబాద్‌ సమీపంలోని ఘట్కేసర్‌లో ఉన్న అనురాగ్‌ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. టీచర్స్ తనను టార్గెట్ చేస్తూ రోజూ అవమానిస్తున్నారని కోపంతో బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. తోటి విద్యార్థులు ఆయన్ని రక్షించి ఆసుపత్రికి తరిలిచారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. 


ఘట్కేసర్ - అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి జ్ఞానేశ్వర్‌ను జుట్టు కట్ చేసుకోవాలని ఉపాధ్యాయులు చెప్పారు. షూ లేకుండా చెప్పులతో క్లాస్‌లకు హాజరవుతుండటంపై ప్రశ్నించారు. మొదటి నుంచి తనను టార్గెట్ చేస్తూ డీన్ శ్రీనివాసరావు, ఫిజికల్ టైనర్ తనను అవమానించారని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు.  


చేయని తప్పులకు అందరి ముందు అవమానించడమే కాకుండా తోటి విద్యార్థులు ఉన్న హేళనగా మాట్లాడడం, కొట్టడం చేస్తున్నారని వాపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినట్టు  జ్ఞానేశ్వర్‌ వివరించారు. తన తండ్రి కాలేజీకి ఫోన్ చేసిన చెప్పినా వారిలో మార్పు రాలేదని మొదట తన ఐడీ కార్డు తీసుకున్నారని తర్వాత ఇచ్చేశారని అన్నారు. 


జుట్టు విషయంలో డీన్‌ నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ పీటీ మాత్రం ఊరుకోలేదన్నారు. యాక్సిడెంట్‌ కారణంగా చెప్పులతో తిరుగుతుంటే కూడా తప్పు పట్టారన్నారు. జుట్టు పెంచుకోవడం, చెప్పులతో తిరుతుండటంపై పీటీ చాలా అవమానకరంగా మాట్లాడారన్నారు. 
అవన్నీ తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొన్నారు జ్ఞానేశ్వర్. కాలేజీ బిల్డింగ్‌ రెండో అంతస్థు నుంచి దూకేసినట్టు వెల్లడించారు తోటి స్నేహితులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన విద్యార్థి పరిస్థితి తెలుసుకున్న తర్వాతే యూనివర్శిటీ సిబ్బంది పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. 


ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై యూనివర్శిటీ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు జ్ఞానేశ్వర్‌ బంధువులు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసేవారని అనుమానిస్తున్నారు. యాజమాన్యంపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి నుంచి సమాచారం తీసుకున్నార. ఉపాధ్యాయులు, సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. జ్ఞానేశ్వర్ స్నేహితులను కూడా ప్రశ్నించారు.