BJP Leader Brutally Murdered: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి బీజేపీ లీడర్ దారుణహత్యకు గురయ్యారు.  యూసుఫ్ గూడా L.N.నగర్‌లోని సింగోటం రాము అనే వ్యక్తిని దుండగులు కిరాతకంగా చంపేశారు.  ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతుపై కత్తితో పొడిచి హింసించి ప్రాణాలు తీశారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో స్థానికంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు సింగోటం రాములు. సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. 


రాములుది పాలమూరు జిల్లా  కొల్లాపూర్ సింగోటం, అక్కడే సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర్ కర్నూల్ జిల్లా నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాములు ఆ ప్రయత్నాల్లో ఉండగానే దుండగులు హత్య చేశారు. రాత్రి పదకొండు గంటల సమయంలో  10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లుగాకాలనీ వాసులు చెబుతున్నారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్‌ టీంలను రప్పించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాములు బాడీని పోస్టమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.